»   »  ఎయిర్‌ హోస్టెస్‌ నీరజా భానోత్‌ జీవితం సినిమాగా...

ఎయిర్‌ హోస్టెస్‌ నీరజా భానోత్‌ జీవితం సినిమాగా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ ‌: బాలీవుడ్‌లో నిజ జీవితగాథల్ని తెరకెక్కించడం ఇటీవల బాగా ఎక్కువయింది. క్రీడాకారులపై వరసగా వచ్చిన చిత్రాలు చూశాం. ఇప్పుడు తాజాగా 1986లో పాన్‌ ఆమ్‌- 73 విమానం హైజాక్‌ ఘటన నేపథ్యంలో తీవ్రవాదులనుంచి ప్రయాణికుల్ని కాపాడబోయి తన ప్రాణాలు కోల్పోయిన ఎయిర్‌ హోస్టెస్‌ నీరజా భానోత్‌ జీవితంపై చిత్రం తెరకెక్కుతోంది.

అందులో సోనమ్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమైంది. నీరజాభానోత్‌ పాత్ర తనకు లభించడం తన అదృష్టమని నటి సోనమ్‌ కపూర్‌ తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ మ్యాగజైన్లపై మెరిసిన నాయికల్లో ఎవరు సూపర్ హాట్ గా ఉన్నారు అన్న అంశంపై ఓ ఆన్ లైన్ ఛానల్ నిర్వహించిన పోలింగ్ లో సోనమ్ కపూర్ ఏకంగా 41శాతం ఓట్లు కొల్లగొట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇందులో33శాతం ఓట్లను సంపాదించుకున్న అలియా భట్... రెండో స్థానంలో నిలవగా... హార్పర్ బజార్ మ్యాగజైన్ పై తళుక్కుమన్న శ్రీలంక బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండేజ్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. కొత్త భామ నిమ్రత్ కౌర్ , నర్గీస్ ఫక్రీ... చెరో 5శాతం ఓట్లు దక్కించుకుని.... తమ పరువును కూడా నిలెబట్టుకున్నారు.

ఏమైనా... ఇటీవలే స్వైన్ ఫ్లూ నుంచి కోలుకున్న సోనమ్... తనలోని ఫ్యాషన్ సెన్స్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించుకుంది. మరి... త్వరలోనే సల్మాన్ ఖాన్ సరసన ... ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రంలో మెరవనున్న సోనా... విలేజ్ బెల్లీగా ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Sonam Kapoor

కెరీర్ మొదట్లో ఎక్స్ పోజింగ్ కు నో చెప్పిన బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్.. ఇప్పుడు రూటు మార్చడంతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఒకప్పుడు ఈ స్టార్ డాటర్ ను లైట్ తీసుకున్న క్రేజీ హీరోలు.. ఇప్పుడిప్పుడే సోనమ్ వైపు చూడటం మొదలుపెట్టారు. ప్రస్తుతం బజ్ రంగీ బాయిజాన్ సినిమాలో సల్మాన్ సరసన నటిస్తున్న సోనమ్.. ముందు ముందు మరింత మంది పెద్ద హీరోలతో రొమాన్స్ చేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

అయితే ఇటీవల స్వైన్ ఫ్లూ బారిన పడిన సోనమ్.. ఇండస్ట్రీలోని చాలామందిపై గుర్రుగా ఉందట. స్వైన్ ఫ్లూ తగ్గడంతో ఇప్పుడిప్పుడే షూటింగ్స్ కు హాజరవుతున్న అప్ కమింగ్ బ్యూటీ.. మునుపటిలా ఎవరితోనూ పెద్దగా ఇంటరాక్ట్ అవ్వడం లేదట.కామ్ గా తనపని చేసుకుని.. ఇంటికి వెళ్లిపోతోందట ఈ స్టార్ డాటర్. అసలు సోనమ్ కపూర్ ఎందుకిలా బిహేవ్ చేస్తోందని ఆరా తీసిన వారికి.. ఆసక్తికర విషయాలు తెలిశాయట.

స్వైన్ ఫ్లూతో ఆస్పత్రితో ఉన్నప్పుడు తనను కలవడానికి ఎవరూ రాలేదని సోనమ్ బాగా నొచ్చుకుందట. కష్టాల్లో ఉన్నప్పుడు తనను పట్టించుకోని వారితో మాట్లాడటం వేస్ట్ అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయిందట ఈ అందాల భామ. తనను హాస్పిటల్ లో కలిసి పరామర్శించిన హీరోయిన్లు తాన్యా మిశ్రా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లతో మాత్రమే ఫోన్ లో మాట్లాడుతోందట. సోనమ్ తీరు చూసిన కొందరు సినీ జనాలు.. ఈ అమ్మాయికి ఇంకా పిల్ల చేష్టలు పోలేదని గుసగుసలాడుకుంటున్నారట.

ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు ఇలా వ్యవహరిస్తే.. ఆమెకే కష్టమని కొందరు బాహాటంగానే సోనమ్ కు సలహా ఇస్తున్నారట. మొత్తానికి స్వైన్ ఫ్లూ దెబ్బకు సోనమ్ లో సరికొత్త మార్పులువచ్చాయన్నదిమాత్రం క్లియర్ గా అర్థమవుతోంది.

English summary
Actress Sonam Kapoor has begun shooting for the biopic of Indian flight attendant Neerja Bhanot, who was murdered while saving passengers from terrorists on board the hijacked Pan Am Flight 73 in 1986. Sonam, who plays the titular role in the film, said she is humbled to be a part of the biopic.
Please Wait while comments are loading...