అఫీషియల్: సోనమ్ కపూర్ పెళ్లి డేట్ ప్రకటించిన ఫ్యామిలీ, పెళ్లి సందడి షురూ...
Recommended Video

బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ తన బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహుజాను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని వారాలుగా సోనమ్ కపూర్ పెళ్లి డేట్ గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకాలం ఈ విషయమై మౌనంగా ఉన్న కపూర్ ఫ్యామిలీ తాజాగా పెళ్లి డేట్ అఫీషియల్‌గా ప్రకటించారు. మే 8, 2018న ముంబైలో సోనమ్ కపూర్-ఆనంద్ ఆహుజా వివాహం జరుగబోతోంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి.

పైవసీకి భంగం కలిగించొద్దు
మే 8, 2018న ముంబైలో సోనమ్ కపూర్-ఆనంద్ ఆహుజా వివాహం జరుగబోతోందని, ప్రైవేట్ సెర్మనీగా ఈ వేడుక నిర్వహించుకుంటున్నామని, తమ కుటుంబంలో జరుగుతున్న స్పెషల్ సెలబ్రేషన్స్ ఇవి, తమ ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించ వద్దు అని కపూర్ ఫ్యామిలీ రిక్వెస్ట్ చేసింది.

డబ్బు వేస్ట్ చేయడం ఇష్టం లేకనే
చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు తమ పెళ్లి వేడుకను చాలా గ్రాండ్‌గా నిర్వహించుకుంటూ ఉంటారు. అయితే సోనమ్ కపూర్ తన పెళ్లి విషయంలో అలాంటి ఆర్భాటాలకు దూరంగా ఉంటోంది. ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తనకు డబ్బును భారీగా వృదా చేసి అట్టహాసంగా పెళ్లి చేయడం ఇష్టం లేదని, సింపుల్‌గా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక జరుపుకోబోతున్నట్లు సోనమ్ తెలిపారు.

ఆనంద్ ఆహుజా గురించి
సోనమ్ పెళ్లాడబోతున్న ఆనంద్ ఆహుజా విషయానికొస్తే.... ఢిల్లీకి చెందిన వ్యాపారి కొడుకు. షాహి ఎక్స్‌పోర్ట్స్ అనే ఇండియాలోనే అతిపెద్ద ఎక్స్‌పోర్ట్ కంపెనీ ఉంది. రూ. 3వేల కోట్ల సామ్రాజ్యానికి వారసుడు. నాలుగేళ్ల క్రితం ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా సోమన్-ఆనంద్ పరిచయం అయ్యారు. తొలుత ఆనంద్ ప్రపోజ చేయగా... కొన్ని నెలల సమయం తీసుకున్న తర్వాత సోనమ్ ఓకే చెప్పిందట.

కపూర్ ఫ్యామిలీ, బాలీవుడ్ సెలబ్రిటీలే
సోనమ్ కపూర్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు ఆల్రెడీ మొదలయ్యాయి. తమ కూతురు పెళ్లిని అనిల్ కపూర్ దంపతులు స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ వేడుకలో కపూర్ ఫ్యామిలీతో పాటు ఇతర బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











