»   » తన రిలేషన్‌షిప్స్ గురించి చెప్పనంటోన్న హీరోయిన్

తన రిలేషన్‌షిప్స్ గురించి చెప్పనంటోన్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబాయి: బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఏ విషయం అయినా మొహం మీదే చెప్పేస్తుంటుంది. ఇటీవల తన పర్సనల్ విషయాల గురించి అడిగిన మీడియా ప్రతినిధులతో ఆమె తనదైన శైలిలో స్పందించారు. అలాంటి విషయాలు మీడియాతో పంచుకోవడం తనకు ఇష్టం ఉండదు అని తెగేసి చెప్పింది.

‘నేను నా వ్యక్తి గత విషయాలు, రిలేషన్ షిప్స్ గురించి మీడియాతో పంచుకోవడానికి ఇష్టపడను. ఇది సరైంది కాదని నా అభిప్రాయం. అందుకే ఎప్పటికీ అలా చేయను. నా ప్రొఫెషనల్ విషయాల గురించి ఏ విషయం అడిగినా చెబుతాను. దయచేసి పర్సనల్ విషయాలు అడిగి ఇబ్బంది పెట్టొద్దు' అన్నారు.

Sonam Kapoor Doesn't Wants To Go Public About Her Relationships

సోనమ్ కపూర్ సినిమాల విషయానికొస్తే.... ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘ప్రేమ్ రతన్ ధాన్ పాయో' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత తన కెరీర్ మరింత పుంజుకుంటుందని భావిస్తోంది. ఈ చిత్రానికి సూరజ్ ఆర్.బర్జాత్యా దర్శకత్వం వహిస్తున్నాు.

దీంతో పాటు శశాంకా ఘోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బాటల్ ఫర్ బిట్టోరా' సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఫవాద్ ఖాన్, సోమన్ కపూర్, ఆశీష్ చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా నీర్జా భానోట్ చిత్రంలో కూడా సోనమ్ కపూర్ నటిస్తోంది.

English summary
Actress Sonam Kapoor, known for speaking her mind without any fear, says she is “completely against” the idea of opening up about her personal life as it takes the focus away from her work.
Please Wait while comments are loading...