»   » యస్ ..బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ చేస్తున్నా, పేరు అడగొద్దు

యస్ ..బిజినెస్ మ్యాన్ తో డేటింగ్ చేస్తున్నా, పేరు అడగొద్దు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: తమ రిలేషన్స్, తమ లవ్ ఎఫైర్స్ గురించి సెలబ్రెటీలు బహిరంగంగా చెప్పుకోవటానికి ఇష్టపడరు. కానీ సోనమ్ కపూర్ మాత్రం ఇందుకు మినహాయింపు. ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ ఓ కుర్రాడితో బాగా చనువుగా మెలగడం టిన్సెల్ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆ విషయం గురించి ఆమె ఎక్కడా చెప్పటానికి,మాట్లాడటానికి ఇష్ట పడలేదు.

Sonam Kapoor

అయితే మీడియావారు ఆ కుర్రాడు మరెవరో కాదు..ఆనంద్ ఆహుజా అనే వ్యాపారవేత్త అని కనిపెట్టి...రచ్చ రచ్చ చేసేసారు. ఎలాగో అందరికీ తెలిసిన విషయమే కదా అని అతనితో కలసి ఓపెన్‌గానే చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న సోనమ్... తమ మధ్య ఉన్న బంధం గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

అయితే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ టాక్ షో కాఫీ విత్ కరణ్‌లో పాల్గొన్న సోనమ్... ఎట్టకేలకు తన ప్రేమ వ్యవహారాన్ని అంగీకరించకతప్పలేదు. కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో లండన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తున్నట్లు అంగీకరించిన సోనమ్.... ప్రియుడి గురించి మరిన్ని వివరాలు చెప్పేందుకు మాత్రం నిరాకరించింది. మిగతా విషయాలు తన వ్యక్తిగతమని స్పష్టం చేసేసింది.

English summary
Sonam Kapoor and alleged boyfriend Anand Ahuja’s recent visit to London to attend the former’s friend’s engagement went viral on social networking sites, reports of the duo allegedly being a couple soon surfaced.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu