»   » ‘బాహుబలి’ అవకాశం వదులుకుంది... ఇప్పుడు బాధపడి ఏం లాభం?

‘బాహుబలి’ అవకాశం వదులుకుంది... ఇప్పుడు బాధపడి ఏం లాభం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి... ఈ సినిమా విడుదల ముందు ఇదో భారీ బడ్జెట్ ప్రాజెక్టు అని మాత్రమే తెలుసు. ఈ సినిమా కోసం కొందరు బాలీవుడ్ స్టార్లను రాజమౌళి అండ్ టీం సంప్రదించినా చాలా మంది ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపలేదు.

షాకింగ్: బాహుబలి-2 'నైజాం' రైట్స్.... ఎంతో తెలుసా?

సినిమా విడుదలైన తర్వాత కానీ అర్థం కాలేదు ఇది ఇండియన్ సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు వచ్చిన ది గ్రేట్ విజువల్ వండర్ అని. సాధారణంగా సౌత్ సినిమాలు నార్త్ లో ఎక్కువగా ఆడవు, అదే విధంగా నార్త్(బాలీవుడ్) మూవీస్ కూడా సౌత్ లో చూడటానికి ఇష్టపడరు. అయితే అటు ఉత్తరాది ప్రేక్షకులను, ఇటు దక్షిణాది ప్రేక్షకులను బాహుబలి మూవీ తన వశం చేసుకుంది.

Sonam Kapoor

ఇండియాలోని అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు మాగ్జిమమ్ రీచ్ అయిన అతితక్కువ సినిమాల లిస్టులో... బాహుబలి సినిమా చోటు దక్కించుకుంది. ఇలాంటి సినిమాలో తమకు అవకాశం వస్తే బావుండు అని ఆశ పడ్డ స్టార్స్ ఎందరో... కొందరు అవకాశం వచ్చినా తర్వాత సినిమా విజయం చూసి మిస్టేక్ చేసాం అని బాధ పడ్డవారు ఉన్నారు.

మేడమ్ టుస్సాట్స్: ప్రభాస్ మైనపు విగ్రహం ఖర్చెంత? ఎవరు భరిస్తారు?

తాజాగా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్... బాహుబలి సినిమా విషయంలో తాను చేసిన మిస్టేక్ ను బయట పెట్టింది. తనకు బాహుబలి సినిమాలో అవకాశం వచ్చిందని, అప్పుడు తాను దాన్ని రిజక్ట్ చేసి తప్పు చేసానని ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే తనను ఏ పాత్ర కోసం ఈ సినిమాలో అడిగారు అనేది మాత్రం సోనమ్ వెల్లడించలేదు.

English summary
Sonam Kapoor revealed this sensational news in one of her interviews in a chat show which was hosted by yet another actress Neha Dhupia. When Sonam was asked Baahubali film, she suddenly said she knew the script of the film as it was offered to her and she rejected it. This became a huge news all over when Sonam made such a statement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu