»   » నన్ను అక్కడ టచ్ చేయొద్దు: మీడియాకు సోనమ్ కపూర్ వార్నింగ్

నన్ను అక్కడ టచ్ చేయొద్దు: మీడియాకు సోనమ్ కపూర్ వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాలు, ఇతర విషయాలకు సంబంధించి నన్ను టచ్ చేస్తే ఒకే... కానీ నా పర్సనల్ లైఫ్‌ను టచ్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటూ మీడియాకు వార్నింగ్ ఇచ్చింది సోనమ్. ఢిల్లీ టైమ్స్ పత్రికలో సోనమ్ ఎంగేజ్మెంట్ అంటూ వార్త రావడంపై ఆమె తీవ్రంగా స్పందించారు.

డిసెంబర్లో సోనమ్ రింగులో ఫింగర్ అంటూ వార్తలు రావడంతో సోనమ్ ట్వీట్ చేశారు. ఢిల్లీకి చెందిన వ్యాపార వేత్త ఆనంద్ అహుజాతో ఆమె ఎంగేజ్మెంట్ డిసెంబర్లో జరుగబోతోందని ఆ వార్తల సారాంశం. దీనిపై సోనమ్ ఫైర్ అయ్యారు.

ప్రపంచంలో చాలా ఉన్నాయి

ప్రపంచంలో చాలా ఉన్నాయి

`ప్ర‌పంచంలో ఎన్నో విష‌యాలు జ‌రుగుతున్నాయి. మీరు నా వ్య‌క్తిగ‌త జీవితం మీద ఎందుకు ఆస‌క్తి చూపుతున్నారు?` అంటూ ఆమె ట్వీట్ చేసింది. అలాగే తనకు ఎంగేజ్మెంట్ జరుగడం లేదని తేల్చి చెప్పింది.

ఇద్దరూ చాలా క్లోజ్

ఇద్దరూ చాలా క్లోజ్

అసలు ఈ వార్తలు ప్రచారంలోకి రావడానికి కారణం కొంతకాలంగా సోన‌మ్‌ కపూర్, ఆనంద్ ఆహుజా క్లోజ్ గా మూవ్ అవ్వడమే. ఈ మధ్య ఎక్కడికెళ్లినా ఇద్దరూ కలిసే వెలుతున్నారు. ఆ మధ్య ఓ అవార్డు ఫంక్షన్లో కూడా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని కనిపించారు.

ముందు నుండీ సీక్రెట్‌గానే

ముందు నుండీ సీక్రెట్‌గానే

సోనమ్ కపూర్ తన ఎఫైర్లకు సంబంధించిన విషయాలను ముందు నుండీ సీక్రెట్ గానే ఉంచుతోంది. ఆనంద్ ఆహుజా కంటే ముందు ఆమె ఇద్దరు ముగ్గురితో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే.

కావాల్సినంత ఫ్రీడమ్

కావాల్సినంత ఫ్రీడమ్

సోమన్‌కు ఆమె తండ్రి అనిల్ కపూర్ కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. సినిమాల ఎంపిక దగ్గర నుండి లైఫ్ పార్ట్‌నర్ ఎవరిని ఎంచుకోవాలనే విషయం వరకు ఇలా అన్నీ ఆమె ఇష్టానికే వదిలేశారు

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్

ప్రస్తుతం సోనమ్ కపూర్ సంజయ్ దత్ బయోపిక్ చిత్రంలో చేస్తోంది. ఈ చిత్రంలో ఆమె టీనా మునిమ్ పాత్రలో కనిపించబోతోంది. దీంతో పాటు పాడ్ మ్యాన్ అనే మూవీలో కూడా నటిస్తోంది.

Prabhas : Disha Patani, Shraddha Kapoor dropped from "Saaho": Reason is Shocking
English summary
Sonam Kapoor has been in the news for reportedly getting engaged to her boyfriend Anand Ahuja. "there's so much going on in this world but my so called personal life is what you want to cover" Sonam tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu