»   » అమ్మలేని రోజున తొలి జన్మదినం.. భావోద్వేగాల మధ్య జాహ్నవి 21వ బర్త్‌డే..

అమ్మలేని రోజున తొలి జన్మదినం.. భావోద్వేగాల మధ్య జాహ్నవి 21వ బర్త్‌డే..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  శ్రీదేవి మరణ విషాదం నుంచి కపూర్ కుటుంబమే కాదు.. అభిమానులు, సన్నిహితులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. ఇంతటి పుట్టెడు విషాదంలో శ్రీదేవి కూతురు జాహ్నవి జన్మదినం వచ్చేసింది. మంగళవారం జాహ్నవి కపూర్ 21 పడిలోకి ప్రవేశించింది. తల్లి లేకుండా తొలి పుట్టిన రోజును జరుపుకోవడం అనేది జాహ్నవికి మింగుడు పడని విషయమనే చెప్పవచ్చు. ఇలాంటి విషాద క్షణాల నుంచి జాహ్నవి బయటపడి మానసికంగా తాను బలవంతురాలినని ఎలా ప్రూవ్ చేసుకొంటుందో వేచి చూడాల్సిందే.

   సోనమ్ కపూర్ విషెస్

  సోనమ్ కపూర్ విషెస్

  జాహ్నవి బర్త్‌డే సందర్భంగా తన సోదరి సోనమ్ కపూర్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మానసిక ఒత్తిడిని ఎదిరించే ధైర్యవంతులైన అమ్మాయిల్లో జాహ్నవి ఒకరు అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.

  జాహ్నవి మానసికంగా

  జాహ్నవి మానసికంగా

  జాహ్నవి 21 ఏట అడుగుపెట్టింది. నాకు తెలుసు. మానసికంగా బలవంతురాలైన అమ్మాయిల్లో ఒకరైన జాహ్నవి ఈ రోజు యువతిగా మారారు. హ్యాపీ బర్త్‌డే జానూ అని సోనమ్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో జాహ్నవికి బర్త్‌డే విషెస్‌ను అందించారు. ఈ మేరకు నవ్వుతూ ఉన్న జాహ్నవి ఫోటోను షేర్ చేశారు.

   జాహ్నవికి మనీష్ విషెస్

  జాహ్నవికి మనీష్ విషెస్

  జాహ్నవికి జన్మదిన శుభాకాంక్షలు అందించిన వారిలో ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా ఉన్నారు. హ్యాపీ బర్త్‌డే మై డియర్ జాహ్నవి కపూర్. సంతోషాన్ని, ప్రేమను, శాంతిని, ఇంకా అన్నీ నీకు అందించాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అని తన సందేశంలో పేర్కొన్నారు. సందేశంతోపాటు దడక్ షూటింగ్‌లో శ్రీదేవి, జాహ్నవితో కలిసి తీసుకొన్న ఫొటోను మనీష్ మల్హోత్రా షేర్ చేశారు.

   విషాదంలో జాహ్నవి సందేశం

  విషాదంలో జాహ్నవి సందేశం

  తన తల్లి మరణం విషాదం నుంచి కాస్త కుదుటపడిన జాహ్నవి.. శ్రీదేవిని గుర్తుంచుకోవాలని ఆమె కోరారు. నా పుట్టిన రోజున మిమ్మల్ని నేను ఏమీ అడుగను. మీ తల్లిదండ్రులను ప్రేమించమని కోరుతాను. తల్లిదండ్రులను ప్రేమలో ముంచెత్తే విధంగా వారి పట్ల అంకితభావం ప్రదర్శించండి అని సూచించారు.

   తల్లిదండ్రులకు ప్రేమను పంచండి

  తల్లిదండ్రులకు ప్రేమను పంచండి

  అలాగే తల్లిదండ్రులకు అమితమైన ప్రేమను పంచండి. వారు మీకు అందమైన జీవితాన్ని ప్రసాదించారు. అలాగే నా తల్లిని కూడా గుర్తుంచుకోండి. ఆమె ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్థించండి అని జాహ్నవి తన లేఖలో పేర్కొన్నారు.

   నా హృదయంలో శూన్యం

  నా హృదయంలో శూన్యం

  తల్లి మరణం నేపథ్యంలో జాహ్నవి రాసిన లేఖ అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. నా హృదయాన్ని ఓ శూన్యం ఆవిరించింది. ఆ శూన్యం నుంచి బయటపడి ఎలా జీవించాలో నాకు తెలుసు. ఈ శూన్యంలో కూడా నీ ప్రేమను తలచుకొంటాను. నీ ప్రేమ మాటున నీవు లేని బాధను, విషాదాన్ని దిగమింగుతాను.

  మంచిలో నీవే కనిపిస్తావు

  మంచిలో నీవే కనిపిస్తావు

  నేను కళ్లు మూసుకున్న ప్రతీక్షణం నాకు మంచి విషయాలే కళ్లెదుట కనిపిస్తాయి. ఆ మంచిలో నువ్వే కనిపిస్తావు. మా జీవితంలో మీరు ఉండటం మాకు ఓ వరం. దాంతో మా జన్మ ధన్యమైంది.

   స్వచ్చమైన ప్రేమకు

  స్వచ్చమైన ప్రేమకు

  అమ్మా నీవు స్వచ్ఛమైన ప్రేమకు ప్రతిరూపం. మంచికి నీవు నిలువుటద్దం. అంచెంచలమైన ప్రేమకు సాక్ష్యం. నా ఆత్మలో మీరు ఓ భాగం. నాకు నిజమైన స్నేహితురాలివి. నాకు సర్వస్వం నీవే. నీకు సగౌరవాన్ని తెచ్చిపెట్టడానికి కట్టుబడి ఉంటాను.

   ఎప్పుడూ నా చుట్టే

  ఎప్పుడూ నా చుట్టే

  అమ్మా నీవు ఎప్పుడూ నా చుట్టే ఉంటావు. నా చుట్టే తిరుగుతూ మమ్మల్ని కాపాడుతుంటావు. అదే భావనతో ప్రతీరోజు నేను నిద్రలేస్తాను. నీవు ఎక్కడికి వెళ్లలేదు. నాలో, ఖుషీలో, నాన్నలో లీనమయ్యావు అని జాహ్నవి లేఖ రాశారు.

   గతేడాది జన్మదినం రోజున

  గతేడాది జన్మదినం రోజున

  గత జన్మదినం రోజున జాహ్నవికి శ్రీదేవి తెలిపిన శుభాకాంక్షలు చూస్తే గుండె ద్రవించకమానదు. హ్యాపీ బర్త్ డే మై ఏంజెల్. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది నువ్వే. విష్ యూ బెస్ట్ బర్త్‌డే మై బేబీ. లవ్ యూ అని ఓ ఫోటోను శ్రీదేవి షేర్ చేశారు

  English summary
  Janhvi Kapoor turns 21 today, and Sonam took to Instagram to wish her cousin in the sweetest way possible. She wrote, "To one of the strongest girls I know, who became a woman today. Happy birthday jannu. janhvikapoor #21stbirthday." Apart from Sonam, Sridevi's close friend Manish Malhotra, too, wished Janhvi on her birthday. The designer shared a picture of him with Sridevi and Janhvi from the sets of Dhadak, and wrote, "Happy Birthday my dearest janhvikapoor May God Bless you With Happiness Love Peace and Just Everything."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more