For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సారీ అభిషేక్ బచ్చన్...! నీ మీద ఐశ్వర్య రాయ్‌కి కోరిక లేదు!

  By Bojja Kumar
  |

  ముంబై: మీరు ఐశ్వర్యారాయ్ అభిమానులైతే.... హెడ్డింగ్ చూసిన వెంటనే మీకు కోపం రావొచ్చు. అయితే ఇదేదో మేం కావాలని చేసింది కాదు. ఐశ్వర్యరాయ్ నోటి నుండి ఆ మాటలు వచ్చాయి కాబట్టే అక్కడ అలా హెడ్డింగ్ పెట్టాల్సి వచ్చింది.

  ఇటీవల ఐశ్వర్యరాయ్ కరణ్ సింగ్ చాబ్రా హోస్ట్ చేస్తున్న టాక్ షోలో 'నెవర్ హ్యావ్ ఐ ఎవర్' అనే గేమ్ ఆడింది. ఈ సందర్భంగా ఐశ్వర్యకు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించారు. మీకు ఎవరిమీద అయినా ఎప్పటికీ క్రష్(తీవ్రమైన వాంఛ) కలిగి ఉంటే.. వారిలో మీకంటే చిన్న వారు ఎవరు? అనే ప్రశ్నకు స్పందిస్తూ...'నాకు పెళ్లయింది.. నా భర్త నాకంటే చిన్న వాడు, కానీ అతని మీద నాకు క్రష్ లేదు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది... దాన్నే మేము కొనసాగిస్తున్నాము' అంటూ సమాధానం ఇచ్చారు.

  మీకు తెలుసా.. తొలిసారిగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ 'ఔర్ ఫ్యార్ హోగయా' సినిమా షూటింగ్ సెట్స్ లో కలిసారు. ఆ సమయంలో ఆమె అభిషేక్ బచ్చన్ ఫ్రెండ్ బాబీ డియోల్ తో కలిసి షూటింగులో ఉంది.

  తర్వాత ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ కలిసి కలిసి 'ధాయ్ అక్షర్ ప్రేమ్ కె' ప్రాజెక్టుకు కలిసి పని చేసారు. ఈ సినిమా సమయంలోనే ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత ఈ ఇద్దరూ కలిసి పని చేసిన సినిమా సినిమాకు వీరి స్నేహం మరింత బలపడింది. ఇద్దరూ పెళ్లి చేసుకుని అన్యోన్య దాంపత్యం సాగిస్తున్నారు. బెస్ట్ రిలేషన్ షిప్ అనేది ఫ్రెండ్షిప్ నుండే మొదలవుతుందనడానికి ఐష్-అభిషేక్ బంధాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

  'గురు' సినిమా సమయంలో ఇద్దరూ ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నారు. అప్పుడే ఉంగరాలు గిఫ్టుగా ఇచ్చుకున్నారు. గురు సినిమాలో వారి చేతికి ఉన్నవి సినిమా రింగ్స్ కాదు.... ఒకరిపై ఒకరు ప్రేమతో ఇచ్చుకున్న రియల్ గిఫ్ట్ రింగ్సే.

  ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ...'ఓ సినిమా షూటింగులో భాగంగా నేను న్యూయార్క్ లో ఉన్నాను. నేను ఉంటున్న హోటల్ రూమ్ బాల్కనిలో నిల్చొని...ఏదో ఒక రోజు ఆమెతో కలిసి ఇక్కడ ఉండాలని కోరుకున్నాను. సంవత్సరం తర్వాత 'గురు' మూవీ ఫ్రీమియర్ షో కోసం ఇక్కడకు వచ్చాం. ప్రీమియర్ పూర్తయిన తర్వాత హోటల్ కు తిరిగి వెళ్లాం... అదే బాల్కనీకి ఆమెను తీసుకెళ్లి, నన్ను పెళ్లి పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేసాను' అన్నారు. (హౌ రొమాంటిక్...)

  స్లైడ్ షోలో ఫోటోస్..

  ఐష్-అభి

  ఐష్-అభి

  వయసులో తనకంటే చిన్నవాడైన అభిషేక్ బచ్చన్‌తో ప్రేమలో పడిన ఐష్ ఏప్రిల్ 20, 2007న పెళ్లాడింది.

  అడ్డు రాలేదు

  అడ్డు రాలేదు

  పెళ్లికి ముందే ఇద్దరూ పలు చిత్రాల్లో కలిసి నటించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అటాచ్మెంట్ పెరిగింది. ఆ అనుబంధమే ఇద్దరూ పెళ్లి వైపు అడుగులు వేసేలా చేసింది. ఐశ్వర్య వయసులో పెద్దదయినా వారి పెళ్లికి ఇవేమీ అడ్డు రాలేదు.

  అన్యోన్యంగా..

  అన్యోన్యంగా..

  ఇద్దరి పండంటి కాపురానికి గుర్తుగా 'ఆరాధ్య' జన్మించింది. ఎలాంటి కలతలు, గొడవలు లేకుండా గత తొమ్మిదేళ్లుగా ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ అనోన్య దాంపత్యం కొనసాగిస్తున్నారు

  పెళ్లి

  పెళ్లి

  బాలీవుడ్లో జరిగిన అత్యంత ఖరీదైన వాహాల్లో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ వివాహం కూడా ఒకటి.

  గురు

  గురు

  మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘గరు' సినిమా సమయంలో అభిషేక్ బచ్చన్ తన మనసులోని మాటను ఐశ్వర్యకు వెల్లడించారు. ఐశ్వర్య అతని ప్రపోజల్ కి ఓకే చెప్పింది.

  అభిషేక్

  అభిషేక్

  ఐశ్వర్యరాయ్ తన భార్యగా దొరకడం ఎంతో లక్కీగా ఫీలవుతుంటాడు అభిషేక్. దీన్ని బట్టి ఇద్దరి మధ్య ప్రేమ బంధం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

  భర్త కోసం

  భర్త కోసం

  భర్త కోసం వంట నేర్చుకోవడంతో పాటు...ఎన్నో రుచికరమైన వంటలు అతనికి చేసి పెడుతుందట ఐష్.

  ఇంట్లో ఒకే

  ఇంట్లో ఒకే

  ఐష్ తో తన ప్రేమ విషయాన్ని....అభిషేక్ బచ్చన్ తన తల్లిదండ్రులైన అమితాబ్-జయకు చెప్పగానే వెంటనే ఓకే చెప్పారట.

  English summary
  No no wait...don't get angry on us! It's Abhishek Bachchan's darling wife Aishwarya Rai Bachchan, who said this! Aishwarya Rai Bachchan recently played a game of "Never Have I Ever" with talk show host Karan Singh Chhabra. On being asked if she ever had a crush on someone who is younger than her, Aishwarya said, ''I am married and my husband is younger than me but I never had a crush on him. It was friendship and we just hit it off"
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X