»   » బాలయ్య ఫ్యాన్స్ ఫైర్, క్షమాపణ చెప్పి ఇకపై అలాంటివి చేయనని హామి(వీడియో)

బాలయ్య ఫ్యాన్స్ ఫైర్, క్షమాపణ చెప్పి ఇకపై అలాంటివి చేయనని హామి(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పుడు ఫృద్వీ టైమ్ నడుస్తోంది. వస్తున్న ప్రతీ సినిమాలోనూ మేజర్ కామెడీ రోల్ పోషిస్తున్నాడు. అంతేనా...ఓ ట్రైలర్ వచ్చిందంటే ఫృధ్వి ఎండ్ పంచ్ ఉండాల్సిందే. అలా అదరకొడుతున్న ఫృధ్వీకు రీసెంట్ గా బాలకృష్ణ ఫ్యాన్స్ నుంచి వార్నింగ్ వచ్చాయని సమాచారం.

రీసెంట్ గా సునీల్ హీరోగా వచ్చిన జక్కన్న సినిమాలో ఫృధ్వీ చేసిన కటకటాల కట్టప్ప పాత్ర బాలయ్య అభిమానుల కోపానికి గురి చేసింది. బాలయ్యను మరీ ఓవర్ గా ఇమిటేట్ చేసి వెకిలి చేష్టలు చేసాడని బాలయ్య అభిమానులు ఫృద్వీపై ఓ రేంజిలో ఫైర్ అయ్యారు.

ట్రైలర్ చూసిన ఫ్యాన్స్...జక్కన్న సినిమాను ఖచ్చితంగా చూడాలని ఫిక్స్ అయ్యి రిలీజ్ రోజు మార్నింగ్ షోకు వెళ్లారట. అందులో పృధ్వీ అనుకరణ మరీ ఓవర్ ఉందని షో పూర్తైన వెంటనే ఫృధ్వీ నంబర్ సంపాదించి ఫోన్ లు చేసారట.

'Sorry, I'll Never Joke About Balayya' :Prudhvi

తెలుగు రెండు రాష్ట్రాల అభిమానుల మాత్రమే కాక కొందరు ఎన్నారై ఫ్యాన్స్ సైతం ఫృధ్వీకు ఫోన్ చేసి వాయించారట. వారంతా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ ఫృథ్వీ పై ఎటాక్ చేసారు.

దాంతో ఫృధ్వీ ఈ వివాద రూపం దాల్చి ముదిరే సూచనలు కనపిచటంతో వెంటనే స్వయంగా స్పందించాల్సి వచ్చింది. కేవలం సినిమాలో పాత్ర పరంగానే అలా నటించానని, బాలకృష్ణను కించపరిచే ఉద్దేశ్యం తనకు అసలు లేదని వివరణ ఇచ్చాడు. ఆ వీడియోని మీరు చూడండి.

అంతేకాకుండా తాను బాలయ్య అభిమాననే అని, సినిమాలో పాత్రను పాత్ర పరంగానే చూడాల్సిందని రిక్వెస్ట్ చేసాడు. విమర్శలు వస్తున్నందున ఇకపై బాలయ్య స్ఫూఫ్ లు చేయనని వివరణ ఇచ్చారు. మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ కోపం ఎలా ఉంటుందో ఫృధ్వీ చూసాడన్నమాట.

English summary
Unable to withstand Balayya fans' anger, Prudhvi finally tendered an apology to Balayya fans and vowed to never spoof Balayya in his films from now on.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X