సారీ నో..మెగాస్టార్, రామ్ చరణ్‌పై ఒత్తిడి ఉండవద్దనే!
ముంబై : రామ్ చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్'లో ఒరిజినల్ జంజీర్ హీరో అయిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం రామ్ చరణ్ కూడా ఆయన పాత్ర ఉంటుందనే క్లూ ఇచ్చారు మీడియాకు. దీంతో జంజీర్ రీమేక్ లో అమితాబ్ పాత్ర ఉంటుదనే ప్రచారం జోరుగా సాగింది.
అయితే ఈ విషయమై తాజాగా దర్శకుడు అపూర్వ లఖియాను సంప్రదించగా...'అమితాబ్ లాంటి ఇండియాస్ మోస్ట్ ఐకానిక్ నటులు తమ సినిమాలో ఉండటం ఏ ఫిల్మ్ మేకర్ అయినా ఎంతో గొప్పగా భావిస్తారు, కానీ 'జంజీర్' రీమేక్ లో అమిత్‌జీ నటించడం లేదు. జంజీర్ ఒరిజినల్ లో యాంగ్రీ యంగ్ మేన్‌గా అదరగొట్టిన అమిత్ జీ రీమేక్ లో నటించడం వల్ల యువ హీరో రామ్ చరణ్‌పై మరింత ఒత్తిడి పెరుగుతుంది. తొలుత అమిత్‌జీతో గెస్ట్ రోల్ చేయించాలని అనుకున్నాం. కానీ ఆ తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నాం' అని వెల్లడించారు.
ఈ సందర్భంగా అపూర్వ లఖియా తన దర్శకత్వంలో వచ్చిన 'షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా' సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈచిత్రంలో అమితాబ్, సంజయ్ దత్ కలిసి నటించారు. 'ఆ సినిమాలో ఓ డైలాగులో సంజయ్ దత్ అమితాబ్ ను హిందీ బూతు పదం(c****ya)తో పిలవాల్సి వస్తుంది. సంజయ్ ఆ డైలాగ్ చెప్పడానికి నిరాకరించారు. కానీ అమిత్‌జీ ఫర్వాలేదు చెప్పమని ఎంకరేజ్ చేసారు. ఆ తర్వాత మేం ఫైనల్‌గా ఆ డైలాగును మార్చాం. అమిత్‍జీ కమిట్ మెంట్, ప్రొఫెషనలిజం ఎలా ఉంటుందో గుర్తు చేయడానికే ఈ విషయం చెప్పాను అని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











