twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదాస్పద చిత్రం 'సారీ టీచర్‌' కథేంటి?

    By Srikanya
    |

    చెన్నై : ఆర్యమీనన్‌, కావ్యాసింగ్‌ హీరో,హీరోయిన్స్ గా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం 'సారీ టీచర్‌'. విడుదలకు ముందే వివిధ కారణాలతో వివాదం రేకిత్తించిన ఈ చిత్రం కథ చూస్తే...తనకన్నా వయసులో పెద్దదైన అమ్మాయిని చూసి హీరో ప్రేమలో పడతాడు. వయసు పెద్దని తెలిసినా ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుతాడు. అంతేకాదు.. తాను ఒకరోజు కాలేజీకు వెళితే అక్కడ ఆమె ఉపాధ్యాయినిగా కనిపించేసరికి ఆశ్చర్యపోతాడు. అయినా తన ప్రేమను దక్కించుకునేందుకు తాపత్రయపడతాడు. చివరికి ఏమైందన్నదే కథ అంటున్నాడు దర్శకుడు శ్రీసత్య.

    Sorry Teacher

    దర్శకుడు మాట్లాడుతూ-''టీచర్‌ని ఓ స్టూడెంట్ ప్రేమిస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో ఈ సినిమా రూపొందించాను. ఇందులో స్టూడెంట్ చూడకూడనివి చూస్తూ, చేయకూడనివి చేస్తూ, అనకూడనివి అంటూ చివరకు 'సారీ టీచర్' అంటుంటాడు. టీచర్‌ని ప్రేమలో పడేయడానికి స్టూడెంట్ చేసిన ప్రయత్నాలేంటి? అతని ప్రయత్నం సఫలం అయ్యిందా? అనే ప్రశ్నలకు సమధానమే మిగిలిన కథ'' అని తెలిపారు.
    'కమర్షియల్‌ హంగులతో తెరకెక్కిస్తున్నాం. పెడదోవ పడుతున్న యువకులకు ఇదో గుణపాఠంగా కూడా ఉంటుందన్నది మా నమ్మకం. వచ్చేనెలలో తెరపైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని' చిత్రవర్గాలు తెలిపాయి.

    మహిళా టీచర్ల హుందాతనాన్ని దెబ్బతీసేదిగా, యువతను పక్కదారి పట్టించేదిగా ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 'సారీ టీచర్' చిత్రంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడా చిత్రం విడుదలకు సిద్దమైంది. ఆర్యమన్, కావ్యాసింగ్ జంటగా సూర్యలోక్ ఫిలిమ్స్ ఫ్యాక్టరీ నిర్మించిన 'సారీ టీచర్' చిత్రం అన్ని అవరోధాలను తొలగించుకుని విడుదలకు సిద్ధమైంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తామని నిర్మాత ఆనంద్ చెప్పారు.

    'సారీ టీచర్'కు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చామని.. ఐదుగురు సభ్యులతో కూడిన బృందం దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు. పోస్టర్లలో దృశ్యాలు బాగాలేని పక్షంలో ఫిర్యాదుదారులు జిల్లా కోర్టులకు వెళ్లవచ్చని సూచన చేశారు.పోస్టర్లలో అసభ్యత ఉంటే తామూ పోలీసులకే ఫిర్యాదు చేస్తామని వివరించారు. యు/ఏ సర్టిఫికేట్ ఇవ్వడం అంటే, దాని ఉద్దేశం.. 12 ఏళ్ల లోపు పిల్లలు చూడాలో వద్దో వారితల్లిదండ్రులే నిర్ణయించుకోవాలని చెప్పడమని వివరించారు. ఆ సినిమా మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నట్లు, మహిళా టీచర్ల హుందాతనాన్ని దెబ్బతీసేదిగా ఉందనడాన్ని, యువతను పక్కదారి పట్టించేదిగా ఉందన్న వాదనను సెన్సార్ బోర్డు కొట్టి పారేసింది.

    శ్రీసత్య 'సారీ టీచర్' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో టీచర్‌గా కావ్యాసింగ్, ఆర్యమన్ స్టూడెంట్‌గా నటించారు. వీరిద్దరికీ ఇదే తొలి సినిమా. తన పాత్రను దర్శకుడు డిజైన్ చేసిన తీరు తనకు బాగా నచ్చిందని, ప్రేక్షకులతో కలిసి ఈ చిత్రాన్ని తనూ చూడాలనే కోరికతో ఉన్నానని కావ్యాసింగ్ చెప్పారు. ఆసక్తికరమైన సంఘటనలతో సినిమా రూపుదిద్దుకుందని, తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని దర్శకుడు చెప్పారు. శ్వేత, మేల్కొటే, కోట శంకరరావు, జాకీ, అభినయకృష్ణ, జెమిని ఫణి, పద్మాజయంతి, రేవంత్‌రెడ్డి, హర్ష, మాస్టర్ మనోజ్‌కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: జయసూర్య, సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి, ఫొటోగ్రఫీ: సాయి, ఎడిటర్: అర్చనా ఆనంద్, నిర్మాత: ఆనంద్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీసత్య.

    English summary
    Director Sri Satya's upcoming Telugu movie Sorry Teacher, which stars Aryaman and Kavya Singh in leads, is facing the wrath of teachers. But censor board green signal to 'Sorry Teacher' movie. The film is ready to release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X