»   » సైమా అవార్డ్స్ కర్టెన్ రైజర్...శ్రీయ, రానా సందడి (ఫోటోస్)

సైమా అవార్డ్స్ కర్టెన్ రైజర్...శ్రీయ, రానా సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా) కార్యక్రమం ఈ ఏడాది మలేషియాలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఈఅవార్డుల కార్యక్రమం జరుగనుంది. ఈ మేరకు హైదరాబాద్ లో కర్టెన్ రైజర్ కార్యక్రమం ఏర్పాటు చేసి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. శ్రీయ, రానా దగ్గుబాటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్ మాట్లాడుతూ...'సెప్టెంబర్ 12, 13న మలేషియాలో అంతర్జాతీయ స్తాయిలో వేడుక నిర్వహించబోతున్నాం. వేడుకలో దక్షిణాది తారలంతా కనిపిస్తారు. పురస్కారాల ప్రధానంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మనోహరి పెరియార్ స్వామి, టోనీ నాగమయ, తిరుమలరెడ్డి, శుభోది పాలం, విష్ణు తదితరులు పాల్గొన్నారు. వేడుకకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

శ్రీయ

శ్రీయ

శ్రీయ మాట్లాడుతూ....ప్రపంచ మార్కెట్లో మన సౌత్ సినిమాలను నిలబెట్టడానికి, అక్కడి వారికి మన సినిమాలను పరిచయం చేయడానికి ఇలాంటి అవార్డుల కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు.

సౌత్ సినిమాల వల్లే...

సౌత్ సినిమాల వల్లే...

సౌత్ సినిమా వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను. పరిశ్రమ నాకు మంచి అవకాశాలను ఇచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేసిన సినిమాను ఎప్పటికీ మరిచిపోను అన్నారు శ్రీయ.

శ్రీయ బర్త్ డే...

శ్రీయ బర్త్ డే...

సెప్టెంబర్ 11న నా పుట్టినరోజు, 12, 13న అవార్డుల కార్యక్రమం. ఈ సారి మలేషియాలో స్కూబా డైవింగ్‌కు వెళ్లాలనుకుంటున్నానని శ్రీయ తెలిపారు.

రానా

రానా

రానా మాట్లాడుతూ సౌత్ సినిమాల ప్రతిష్ట పెంచే విధంగా ఈ అవార్డుల కార్యక్రమం ఉంటుందని, అంతర్జాతీయ స్థాయిలో మన సినిమాలకు గుర్తింపు రావడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని తెలిపారు.

English summary
The nominations for the prestigious South Indian International Movie Awards (SIIMA) 2014 were announced at a press conference held at a five star hotel in Hyderabad. Actor Rana Daggubati and actress Shriya Saran, who are the brand ambassadors of SIIMA, were present on the occasion.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu