»   » గెట్ వెల్ సూన్: ఎస్పీ బాల సుబ్రమణ్యం

గెట్ వెల్ సూన్: ఎస్పీ బాల సుబ్రమణ్యం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఆయన అబిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్దిస్తున్నారు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో గెట్ వెల్ సూన్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం చేరారు.

శంకర్ మహదేవన్ త్వరగా కోలుకోవాలని ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. శంకర్ మహదేవన్‌తో కలిసి తీసుకున్న ఫోటోను షేర్ చేస్తూ... గెట్‌వెల్ సూన్ బడ్డీ....నీ పాట కోసం మ్యూజిక్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది అంటూ పోస్ట్ చేశారు.

Get well soon buddy. The entire music world awaits to listen to you. Love

Posted by S. P. Balasubrahmanyam on 9 December 2015

అయితే శంకర్ మహదేవన్‌కు గుండెపోటు అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అధిక శారీరక శ్రమ కారణంగా అలసిపోయి ఓవర్ ఎక్సర్షన్‌తో బాధపడ్డారే కాని.. గుండెల్లో నొప్పి కాదట. కాకపోతే డౌట్ రావడంతో ఆయనకు యాంజియోగ్రామ్ చేశారట. దీనిపై శంకర్ మహదేవన్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

My dearest friends and well wishers, I have no words to express my gratitude for the amount of love and prayers I've...

Posted by Shankar Mahadevan on 8 December 2015

స్వల్ప అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరవలసి వచ్చిందని, చికిత్స అనంతరం ఇప్పుడు కోలుకుంటున్నానని, "ఆల్ ఈజ్ వెల్. నేనిప్పుడు బాగానే ఉన్నా...నా ఆరోగ్యం గురించి ప్రార్ధించిన అందరికీ కృతజ్ఞతలు" అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

English summary
Singer Sp Balasubrahmanyam wrote in Fb "Get well soon buddy. The entire music world awaits to listen to you. Love".
Please Wait while comments are loading...