»   » అయ్యో... ఎస్పీ బాలుపై మళ్లీ, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు!

అయ్యో... ఎస్పీ బాలుపై మళ్లీ, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
SP Balasubrahmanyam Suffering From Some Ailment ?

ప్రముఖ తెలుగు గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత కొన్నాళ్లుగా ఓ సమస్య ఎదుర్కొంటున్నారు. ఆయన గురించి ప్రతిసారి తప్పుడు ప్రచారం జరుగడమే ఇందుకు కారణం. అది కూడా ఆయన ఆరోగ్యం విషయంలోనే. ఇలా జరిగిన ప్రతిసారి ఆయన అభిమానులకు వివరణ ఇస్తూ విసిగి వేసారిపోతున్నారు.

గతంలో ఎస్పీ బాలు ఆరోగ్యం విషయంలో ఇలాంటి ప్రచారాలు చాలా జరిగాయి. ఆయన అనేక సందర్భాల్లో ఇందుకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. తాజాగా మరోసారి ఇలాంటి పరిణామాలే ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వదంతులు నమ్మ వద్దు

వదంతులు నమ్మ వద్దు

తన ఆరోగ్యం బాగుండలేదంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని, ఎస్పీ బాలసుబ్రహ్మణం తన అభిమానులకు, శ్రేయోభిలాషులకు సోషల్ మీడియా ద్వారా సందేశం పంపారు.

పొరపాటు పడ్డారేమో

పొరపాటు పడ్డారేమో

తనకు ఆరోగ్య సమస్య ఉన్న కారణంగానే ప్రదర్శనలు రద్దు చేసుకున్నారనే ప్రచారం జరుగుతోందని కొందరు శ్రేయోభిలాషులు తన దృష్టికి తీసుకొచ్చారని, దగ్గు, జలుబు వచ్చి డాక్టర్ దగ్గరికి వెళితే తన ఆరోగ్యం బాగుండలేదని అనుకుని ఉంటారని అన్నారు.

సోదరి కన్నుమూత

సోదరి కన్నుమూత

తన ప్రదర్శనల రద్దుకు కారణం.. తన సోదరి గిరిజ కన్నుమూయడమేనని, దాదాపు 12 రోజులు అక్కడే గడపాల్సి వచ్చిందని అన్నారు. ఈ సంఘటన తర్వాత సెప్టెంబరు 2న బెంగళూరులో ప్రదర్శన ఇచ్చానని తెలిపారు.

షూటింగులో బిజీ బిజీ

షూటింగులో బిజీ బిజీ

ప్రస్తుతం ‘స్వరాభిషేకం' షూటింగ్ నిమిత్తం రామోజీ ఫిలిం సిటీలో బిజీగా గడుపుతున్నట్లు, తన ఆరోగ్యం గురించి అభిమానులు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదని, ఇలాంటి వదంతులు సృష్టించి, ఎందుకు బాధ కల్గిస్తారో అర్థం కావడం లేదని అన్నారు.

వీడియో

ఈ సందర్భంగా తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అభిమానుల్లో ఆందోళన నివృత్తి చేశారు.

English summary
SP Balasubrahmanyam paid a visit to a hospital for a routine health check-up. This fueled the rumours that the Playback Singer might be suffering from some ailment. He was floored with phone calls and messages on social media enquiring about his health condition.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu