»   » అతని వల్లే... రజనీ, ఎస్పీ బాలు బంధానికి బ్రేక్!

అతని వల్లే... రజనీ, ఎస్పీ బాలు బంధానికి బ్రేక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు గత 24 ఏళ్లుగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రం అందిస్తూ వస్తున్నారు. రజనీకాంత్ టోన్ కు బాలు వాయిస్ పర్ ఫెక్టుగా సూటవుతుండటమే ఇందుకు కారణం. 'లింగ' వరకు రజనీకాంత్ నటించిన ప్రతి చిత్రంలోనూ పాడారు.అయితే రజనీకాంత్ తాజా సినిమా 'కబాలి'లో మాత్రం బాలు పాట లేదు.

ఈ చిత్రానికి సంగీతం అందించిన యువ సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్ ఎందుకు ఈ సంప్రదాయానికి బ్రేక్ వేసారు? కావాలనే ఇలా చేసారా? లేక అనుకోకుండా ఇలా జరిగిపోయిందా? అనేది తెలియదు. ఇటీవల విడుదలైన 'కబాలి' ఆడియో ట్రాక్ లిస్టులో బాలు పేరు లేక పోవడంతో పలువురు ఆశ్చర్యపోయారు.

rajini-balu

కబాలి' జులై 1న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళంలో పాటు తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఆడియోను జూన్ 12న భారీ వేడుక మధ్య రిలీజ్ చేయాలని ప్లాన్ చేసారు. అభిమానులు ఈ వేడుక కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. అయితే రజనీకాంత్ అమెరికాలో ఉండటంతో ఆడియో నేరుగా మార్కోట్లోకి విడుదల చేయాలని నిర్ణయించారు.

కబాలి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. నెల రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ తర్వాత ప్రతి ఒక్కరిలోనూ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ టీజర్ ని ఇప్పటి వరకు 23 మిలయన్ల కన్నా ఎక్కువ మందే వీక్షించారు. తెలుగు, తమిళంలో ఈ టీజర్ రిలీజ్ చేసారు. ఒక్క తమిళం టీజర్ కే 20 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. తెలుగులో 3 మిలియన్లకుపైగా చూసారు. కేవలం నెల రోజుల వ్యవధిలో ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ టీజర్ కు ఈ రేంజిలో రెస్పాన్స్ రాలేదట. అందుకే దీన్ని వరల్డ్ రికార్డ్ అంటున్నారు అభిమానులు.

English summary
The soundtrack of superstar Rajinikanth-starrer Kabali was unveiled in YouTube for the public on Sunday. Featuring voices of a host of young and promising singers, Kabali is the first Rajinikanth-starrer in over two decades that doesn’t feature an S.P. Balasubrahmanyam number.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu