»   » అవి పుకార్లే, నేను బాగానే ఉన్నా: బాలసుబ్రహ్మణ్యం

అవి పుకార్లే, నేను బాగానే ఉన్నా: బాలసుబ్రహ్మణ్యం

Posted By:
Subscribe to Filmibeat Telugu
SP Balasubramaniam
హైదరాబాద్: ప్రముఖ గాయకుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం అస్వస్థతకు గురైనట్లు వార్తలు రావడంతో ఆయన అభిమానులు కాస్త కంగారుపడ్డాయి. అయితే ఆ వార్తల్లోనిజం లేదని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని 67 ఏళ్ల బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేసారు.

ఇటీవల జరిగిన ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ సౌతాఫ్రికా కార్యక్రమంలో లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు అందుకోవడానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సౌతాఫ్రికా వెళ్లారు. అయితే నిర్వాహకులు డర్బన్‌లో మరో కార్యక్రమం ఏర్పాటు చేసారు. అప్పటికే ఇండియా నుండి సౌతాఫ్రికా ప్రయాణం చేసి అలసిపోయి ఉన్న బాలసుబ్రహ్మణ్యం మరునాడే డర్బన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడానికి నిరాకరించారు. తాను అసిపోయి ఉండటం వల్ల ఇప్పటికిప్పుడు ప్రయాణం చేసి డర్బన్  రాలేనని చెప్పారు. అయితే నిర్వహకులు మీడియా వారికి ఆయన అస్వస్థతకు గురైనట్లు చెప్పడంతో.....ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

తన ఆరోగ్యం గురించి మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతుండటంతో....స్పందించిన బాలసుబ్రహ్మణ్యం అసలు ఈ వార్తలు ఎలా ప్రచారంలోకి వచ్చాయో వివరణ ఇచ్చారు. 

తాను యదావిధిగా పాడుతా తీయగా కార్యక్రమంతో పాటు ఇతర అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని ఎస్పీబాలసుబ్రహ్మణ్యం వెల్లడించారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, టీవీ కార్యక్రమాల ద్వారా ప్రఖ్యాతి గాంచిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇప్పటికీ చురుకుగా సంగీత సాగరంలో ముగిని తేలుతున్నారు.

English summary
SP Balasubramaniam health condition is well. He denied the news of his illness.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu