»   » ఆందోళన వద్దంటూ ఎస్పీబాలు వివరణ: ఫేస్ బుక్ పోస్టే కారణం...

ఆందోళన వద్దంటూ ఎస్పీబాలు వివరణ: ఫేస్ బుక్ పోస్టే కారణం...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ప్రస్తుతం 'ఎస్పీబీ50' మ్యూజిక్ కాన్సెర్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అమెరికాలో కాన్సెర్టులు నిర్వహిస్తున్నారు.

అయితే ఇటీవల ఎస్పీ బాలుతన ఫేస్ బుక్ పేజ్ లో పాస్ట్ పోర్ట్ తో పాటు క్రెడిట్ కార్డ్స్, క్యాష్ మరియు ఐప్యాడ్ లాంటి విలువైన వస్తువులు పోగొట్టుకొట్టున్నట్టు ఓ పోస్టు పెట్టారు. దీంతో మీడియాలో రకరకాల ప్రచారం జరిగింది. ఎస్పీ బాలు అమెరికాలో నిస్సహాయ స్థితిలో ఉన్నారని, అక్కడ ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు ఆందోలనలో పడ్డారు.

ఆందోళన వద్దు, ఇపుడు ఓకే

ఆందోళన వద్దు, ఇపుడు ఓకే

అయితే మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగడంతో ఎస్పీ బాలు ఫేస్ బుక్ లో ఓ వీడియో సందేశం పోస్టు చేసారు. ఇపుడు ఎలాంటి సమస్య లేదని, ఇండియన్ ఎంబాసి హోస్టన్ సాయంతో 24 గంటలలో డ్యూప్లికేట్ పాస్ పోర్ట్ పొందినట్టు తెలిపారు. అభిమానుల ఎలాంటి ఆందోళన చేందొద్దని పేర్కొన్నాడు.

ఇక్కడ అద్భుతంగా జరుగుతోంది

ఇక్కడ అద్భుతంగా జరుగుతోంది

అమెరికాలో ప్రస్తుతం తనకు ఎలాంటి సమస్య లేదు. 9 కాన్సెర్టులు అద్భుతంగా జరిగాయి. మరో 5 కాన్సెర్టుల్లో పాల్గొనబోతున్నాను ఎస్పీ బాలు తెలిపారు.

ఆదరణ బావుంది

ఆదరణ బావుంది

అమెరికాలో తాను చేస్తున్న మ్యూజిక్ కాన్సెర్టులకు స్పందన చాలా బావుంది. ఇక్కడి వారి నుండి ఎనలేని ఆదరణ లభిస్తోంది అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.

వీడియో సందేశం

యువర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈజ్ సేఫ్ అంటూ.... ఆయన తాజాగా పోస్టు చేసిన వీడియో సందేశం ఇదే.

English summary
SP Balasubramaniam video message about passport lost. Check out video and get details.Sripathi Panditharadhyula Balasubrahmanyam, popularly known as SPB/ Balu is a legendary playback singer in the Indian Film Industry. Having sung over 40,000 songs in 15 different Indian languages, SPB holds the record for the most number of songs rendered by a playback singer.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu