»   »  పాట పాడుతూ ఎస్పీ బాలు భావోద్వేగం, కన్నీళ్లు....

పాట పాడుతూ ఎస్పీ బాలు భావోద్వేగం, కన్నీళ్లు....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అదో గొప్ప భక్తిరస చిత్రం కాబోతోంది అనేది ప్రజల్లో నమ్మకం. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి లాంటి చిత్రాలే ఇందుకు నిదర్శనం.

తాజాగా కె. రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న ''ఓం నమో వేంకటేశాయ'' సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు హథీరామ్‌ బాబా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా నాగార్జున మెయిన్ రోల్ చేస్తున్నారు.

అన్నమయ్య, శ్రీరామదాసు సినిమాల్లో దర్శకేంద్రుడు...కొన్ని సీన్లను, పాటలను హృద్యంగా.. భావోద్వేగభరితంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సీన్లు చూసి థియేటర్లో ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి.

 ''ఓం నమో వేంకటేశాయ'' సినిమాలోనూ

''ఓం నమో వేంకటేశాయ'' సినిమాలోనూ

తాజాగా ''ఓం నమో వేంకటేశాయ'' సినిమాలోనూ ఇలాంటి భావోద్వేగ భరితమైన సన్నీవేశాలు, పాటలు ఉండబోతున్నాయి. రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన గత భక్తిరస చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన కీరవాణి ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూరుస్తున్నారు.

బాలు కన్నీళ్లు

బాలు కన్నీళ్లు

ఇటీవల సినిమాకు సంబంధించిన పాటను ఎస్పీ బాలుతో రికార్డ్ చేయించారట. పాట పాడుతూ బాలు భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారట.

 ముందు డమ్మీ సింగర్ తో

ముందు డమ్మీ సింగర్ తో

ఈ పాటను డమ్మీ సింగర్ తో రికార్డ్ చేయించినట్లు తెలుస్తోంది. అయితే తెరపై ఎమోషన్ పండాలంటే బాలు వాయిస్ అయితేనే బెటర్ అని కీరవాణి, రాఘవేంద్రరావు భావించారు. ముందు డమ్మీ సింగర్ పాడిన ట్రాక్ తో సీన్ తెరకె్కించారట. బాలుకు ఆ విజువల్స్ చూపించి పాడమన్నారట. దర్శకేంద్రుడు ఆ పాటను చిత్రీకరించిన తీరు చూసి బాలసుబ్రమ్మణ్యం ఎమోషన్ అయ్యారని సమాచారం.

 నాగార్జున

నాగార్జున

గతంలో అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి పాత్రల్లో అలరించిన నాగార్జున ఈ సారి హథీరామ్‌ బాబాగా అదరగొట్టబోతున్నారు.

 అనుష్క

అనుష్క

ఈ సినిమాలో అనుష్క మహా భక్తురాలు కృష్ణమ్మగా ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క ట్రెడిషనల్ డాన్స్ తో ప్రేక్షకులను అలరించబోతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను రాఘవేంద్రరావు రిలీజ్ చేసారు.

 మహాభక్తురాలిగా

మహాభక్తురాలిగా

అనుష్క అనుష్క తన కెరీర్లోనే పూర్తి భిన్నమైన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో గతంలో ప్రేక్షకులు ఎప్పుడూ చూడని కొత్త అనుష్కను చూడబోతున్నాం.

 నాగ్-అనుష్క

నాగ్-అనుష్క

గతంలో నాగార్జున, అనుష్క కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చినా అవన్నీ గ్లామర్, రొమాన్స్ కలగలిపిన చిత్రాలే. ఈసారి ఇద్దరూ కలిసి భక్తి రస చిత్రంలో నటిస్తుండటం విశేషం.

సౌరభ్ఈ

సౌరభ్ఈ


సౌరభ్ఈ సినిమాలో శ్రీ వేంకటేశ్వర స్వామి పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రను నటుడు సౌరభ పోషిస్తున్నారు.

 ఎఎన్ఆర్ కూడా

ఎఎన్ఆర్ కూడా

సినిమాలో ఎఎన్ఆర్ కూడా కనిపించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం జీవించి లేని ఆయన్ను చూపించడం అంటే మామూలు విషయం కాదు. ఆ పాత్రని యానిమేషన్ తో క్రియేట్ చేయనున్నారు. తాజాగా గ్రీన్ మ్యాట్ లో దీనికి సంబంధించిన సన్నివేశాన్ని దర్శకేంద్రుడు చిత్రీకరించాడంటూ ఇండస్ట్రీలో న్యూస్ వినిపిస్తుంది.

 భారీ అంచనాలు

భారీ అంచనాలు

ఈ మద్య కాలంలో అన్నమయ్య, శ్రీరామ దాసు లాంటి భక్తిరస చిత్రాలు రాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.

English summary
SP Balasubramanyam Gets Emotional on Om Namo Venkatesaya movie. Legendary Singer broke down in tears while recording a song for the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X