twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి ముందే మాలో తీవ్రంగా గొడవలు.. నరేష్‌ను టార్గెట్ చేస్తూ.. వేదికపైనే భగ్గుమన్నరాజశేఖర్

    |

    Recommended Video

    Chiranjeevi Angry On Rajasekhar | MAA Association Diary Launch

    మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ 2020 కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, రెబల్ స్టార్ కృష్ణంరాజు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, నటుడు, నిర్మాత మురళీ మోహన్, రచయిత గోపాలకృష్ణ, వీకే నరేష్, జీవితా రాజశేఖర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ..

    డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో

    డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో

    మా డైరీ ఆవిష్కరణ 2020 సందర్భంగా తమిళ చిత్ర పరిశ్రమలోని నడిగర సంఘంలో చోటుచేసుకొంటున్న ఇబ్బందికర పరిస్థితులను ప్రస్తావించారు. ఓ దశలో నడిగర సంఘం అభివృద్దిని, సంక్షేమ పథకాలను చూసి ఆశ్చర్యపోయాను. వారి స్థాయికి మనం వెళ్లలేమా అనే సందేహం కలిగేది. కానీ అక్కడ డబ్బు పెరిగిన కొద్ది అక్కడ కూడా వివాదాలు తారాస్థాయికి చేరుకొన్నాయి అని చిరంజీవి అన్నారు.

    రాజశేఖర్ మైక్ లాక్కోవడంపై

    రాజశేఖర్ మైక్ లాక్కోవడంపై

    చిరంజీవి ప్రసంగిస్తుండగా రాజశేఖర్ మైక్ తీసుకొని మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే నేను ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుతున్నాను. నన్ను మాట్లాడిన తర్వాత నీవు మాట్లాడు. నన్ను మధ్యలో ఆపితే నేను డిస్‌కనెక్ట్ అవుతాను. నీవు దగ్గరకి వస్తే నాకు అదోలా ఉంటుంది అని చిరంజీవి పేర్కొన్నారు. దాంతో పరుచూరి గోపాలకృష్ణ నుంచి మైక్ లాక్కొనేందుకు ప్రయత్నించారు.

    సభలో తీవ్ర గందరగోళం

    సభలో తీవ్ర గందరగోళం

    పరుచూరి గోపాలకృష్ణ నుంచి హీరో రాజశేఖర్ మైక్ లాక్కోవడంపై చిరంజీవి అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో సభలో కొంత గందరగోళం నెలకొన్నది. చిరంజీవి వ్యాఖ్యలపై రాజశేఖర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజశేఖర్ తీరుపై మోహన్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా సభపైనే భగ్గుమన్నాయి.

    రాజశేఖర్ ఆవేశంగా

    రాజశేఖర్ ఆవేశంగా

    మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమం కొనసాగుతుండగానే హీరో రాజశేఖర్ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. మా అధ్యక్షుడు వీకే నరేష్ చేసిన అవకతవకలను మాత్రమే నేను చెప్పాను. నిప్పును కప్పి పుచ్చితే పొగ రాకుండా ఉండదు అంటూ రాజశేఖర్ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

    పెద్దలకు గౌరవం ఇవ్వకుండా

    పెద్దలకు గౌరవం ఇవ్వకుండా

    అంతేకాకుండా చిరంజీవి, రాజశేఖర్ మధ్య కొంత వాగ్వాదం కూడా జరిగింది. పెద్దలను పిలిచి సభ వేదికపై గౌరవం ఇవ్వకుంటే ఇక్కడ ఎందుకు ఉండాలి అంటూ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. వేదికపైనే సుబ్బిరామిరెడ్డి, చిరంజీవి, మోహన్‌బాబు కాళ్లకు మొక్కారు. రాజశేఖర్ ప్రవర్తనపై చిరంజీవి, మోహన్ బాబు విస్మయం వ్యక్తం చేశారు.

    English summary
    Movie Artists Association Dairy Inauguration 2020 held at Park Hayat of Hyderabad. Chiranjeevi, Mohan Babu, Krishnam Raju attended the function.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X