»   » మహేష్ బాబుకు కంగ్రాట్స్ చెబుతూనే.... వివాదంలోకి లాగిన శ్రీరెడ్డి!

మహేష్ బాబుకు కంగ్రాట్స్ చెబుతూనే.... వివాదంలోకి లాగిన శ్రీరెడ్డి!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sri reddy Makes A Controvercial Comments On Maheshbabu

తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాతలు ఏపీ స్పెషల్ స్టేటస్ గురించి జరుగుతున్న ఉద్యమంలో ఎందుకు పాల్గొనడం లేదు? అంటూ కొన్ని రోజులుగా ఓ వివాదం రగులుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ప్రత్యేక హోదా విషయంలో జరిగిన చర్చాకార్యక్రమంలో ఓ టీవీ యాంకర్ సహనం కోల్పోయి సినిమా నటీమణులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో రాజకీయ పరమైన ఎజెండా ఉన్న అతికొద్ది మంది స్టార్స్ తప్ప, సినిమాలే ప్రపంచంగా తమ పని తాము చేసుకుపోయే చాలా మంది స్టార్స్ ఏపీ ప్రత్యేక హోదా విషయమై మాట్లాడటానికి ఇష్టపడటం లేదు.

మహేష్ బాబును లాగే ప్రయత్నం చేసిన శ్రీరెడ్డి

మహేష్ బాబును లాగే ప్రయత్నం చేసిన శ్రీరెడ్డి

సినిమా షూటింగులు, ఫ్యామిలీ, తనకు చేతనైనమేర సేవా కార్యక్రమాలు తప్ప.... బయటి ప్రపంచంలో జరిగే విషయాలను పెద్దగా పట్టించుకోకండా, వివాదాలకు అంటీముట్టనట్లు ఉండే మహేష్ బాబును ప్రత్యేక హోదా వివాదంలోకి లాగే ప్రయత్నం చేశారు శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ అంశంపై కూడా మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్లు స్పందించ లేదని అసంతృప్తిగా ఉన్న ఆమె ఈ సారి ప్రత్యేక హోదా అంశంలోకి మహేష్ బాబును లాగే ప్రయత్నం చేసింది.

కాంగ్రాట్స్ చెబుతూనే....

కాంగ్రాట్స్ చెబుతూనే....

మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను' చిత్రం ఇటీవల విడుదలైన భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆమె సూపర్ స్టార్‌కు కంగ్రాట్స్ చెబుతూనే..... మీ సినిమాను హిట్ చేసిన ప్రజల గురించి కూడా ఆలోచించండి, ఏపీ స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడండి, ప్రజల అభిమతానికి మద్దతుగా నిలవండి, చాలా మంది ఆనందిస్తారు... అంటూ ఆమె తాజాగా ఓ పోస్టు పెట్టారు.

 ఇంతకు ముందు నెగెటివ్ కామెంట్స్

ఇంతకు ముందు నెగెటివ్ కామెంట్స్

భరత్ అనే నేను సినిమా పెద్దగా లేదని, వీక్ కంటెంట్ తో సినిమా చేసారని, అందరు అనుకుంటున్నట్లు ఈ సినిమా హిట్ కాదని, కేవలం మహేష్ బాబు క్రేజ్ వల్ల ఆడిందని... గతంలో శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది. అయితే ఏనుకుందో ఏమో? తెలియదు కానీ ఆ ట్వీట్స్ వెంటనే డిలీట్ చేసింది.

మహేష్ బాబులోని నటుడిని వెలికి తీసింది వారే...

మహేష్ బాబులోని నటుడిని వెలికి తీసింది వారే...

నిజం సినిమాలో మహేష్ బాబు నటించిన ఒక సీన్ ను పోస్ట్ చేసి ''ఇది మహేష్ బాబు అంటే, ఇది యాక్టింగ్ అంటే, ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వొచ్చు ఈ యాక్టింగ్ కి, మహేష్ బాబు లో ఒక గొప్ప నటుడు దాగి ఉన్నాడు, ఒక్క సుకుమార్, తేజ, పూరి జగన్నాధ్ మాత్రమే మహేష్ లో ఉన్న నటుడిని వేలికితిస్తున్నారు'' అని గతంలో శ్రీరెడ్డి ట్విట్టర్లో ఓ కామెంట్ చేశారు.

English summary
"Congratulations Mahesh babu garu for the Bharat anu nenu success..speak up about the special status also,every one feels so happy" Sri Reddy said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X