»   » ఆల్వాల్ సెట్ లో శ్రీరాముడుగా బాలకృష్ణ.....!

ఆల్వాల్ సెట్ లో శ్రీరాముడుగా బాలకృష్ణ.....!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పటికే నందమూరి బాలకృష్ణ మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకుని కంటిన్యూగా షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉంటున్నాడు. తాజాగా మరో సినిమా చేయడానికి కూడా బాలయ్య అంగీకరించాడట. శివలెంక కృష్ణప్రసాద్ తో బాలయ్య ఓ చిత్రం చేయనున్నాడట. ఈ చిత్రానికి శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. ఇప్పటికే ఓ స్టోరీ లైన్ ని బాలయ్యకు వినిపించాడట శ్రీనివాస్. ఆ స్టోరీ లైన్ నచ్చడంతోనే ఈ సినిమా చేయడానికి అంగీకరించాడని సమాచారం. త్వరలో స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసి ఈ చిత్రం షూటింగ్ ఆరంభించాలనుకుంటున్నారట.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ శ్రీరాముడిగా, నయనతార సీతాదేవిగా బాపు దర్శకత్వంలో 'శ్రీరామ రాజ్యం' పేరుతో పౌరాణిక చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ చిత్రం తాజా షెడ్యులు షూటింగు ప్రస్తుతం హైదరాబాదు శివారులోని ఆల్వాల్ లో వేసిన సెట్స్ లో జరుగుతోంది. ఇందులో గత రెండు రోజుల నుంచీ శ్రీరాముడి గెటప్ లో బాలకృష్ణ పాల్గొనే సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు. ఇంతకు ముందు జరిగిన షెడ్యుళ్ళలో వాల్మీకి ఆశ్రమానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించిన సంగతి తెలిసిందే. మొదట్లో ఈ చిత్రాన్ని బాలకృష్ణ పుట్టిన రోజుకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. మరి, ఇటీవలి సమ్మె కారణంగా షూటింగుకి కొన్నాళ్లు ఇబ్బంది కలిగింది. ఈ నేపథ్యంలో రిలీజ్ ఎప్పుడనేది కన్ఫర్మ్ కాలేదు.

English summary
Nandamuri Balakrishna starrer Sri Rama Rajyam under the direction of veteran director Bapu is currently being picturised in a grand set in Alwal. It is known that Bala Krishna is playing the role of Lord Rama and Nayantara as Sita.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu