For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'మేము సైతం': క్రికెట్ ఆడే టీమ్ లు పేర్లు.. వాటి స్పెషాలిటీ

  By Srikanya
  |

  హైదరాబాద్ :వెండి తెరపై హీరోయిజం చూపించే మన హీరోలు ఆటవిడుపు కోసం మైదానంలో అడుగుపెడుతుంటారు. అయితే ఈసారి ఓ సామాజిక బాధ్యతతో బరిలోకి దిగుతున్నారు. 'హుద్‌ హుద్‌' తుపాను బాధితులను ఆదుకోవడానికి 'మేము సైతం' అంటూ ముందుకొస్తున్నారు. ఈ టోర్నమెంట్ లో నాలుగు టీమ్ లుగా విడతీస్తారని తెలుస్తోంది. వాటి పేర్లు ఇలా పెట్టనున్నారు.

  1. రామ్ చరణ్ టీమ్

  2. ఎన్టీఆర్ టీమ్

  3. బాహుబలి టీమ్

  4. అనుష్క టీమ్

  అనుష్క టీమ్ లో అందరూ హీరోయిన్స్ ఉండనున్నారని తెలుస్తోంది. అలాగే... ఆ టీమ్ లో అఖిల్ మాత్రం ఉండనున్నారని చెప్పుకుంటున్నారు.

  వివిధ వినోద కార్యక్రమాల ద్వారా విరాళాలు సేకరించి, ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయాలన్న లక్ష్యంతో తెలుగు చలన చిత్రసీమ ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

  అందులో భాగంగా...థియేటర్లు దద్దరిల్లే డైలాగులతో అభిమానుల్ని మంత్రముగ్థుల్ని చేసే అభిమాన హీరోలు బ్యాటు పట్టుకొని మైదానంలో దిగితే.. ఆ ఆనందమే వేరు. ఎన్నో వినోదాలు పండుతాయి. త్వరలోనే ఇలాంటి అరుదైన దృశ్యాల్ని చూసే అవకాశం దక్కబోతోంది.

  వీటి పూర్తి వివరాలు ఇవిగో... స్లైడ్ షో లో...

  ఎప్పుడు..ఎక్కడ...

  ఎప్పుడు..ఎక్కడ...

  ఈనెల 30న టెలీథాన్‌ ద్వారా పన్నెండు గంటలు ఏకధాటిగా వినోదాలు పంచబోతున్నారు. అందులో భాగంగా 30వ తేదీ మధ్నాహ్యం 3 గంటల నుంచి 6 గంటల వరకూ తారల క్రికెట్‌ మ్యాచ్‌లు జరగబోతున్నాయి.

  ఈసారి విశేషం ఏమిటంటే...

  ఈసారి విశేషం ఏమిటంటే...

  ప్రతీ టీమ్‌లోనూ ఇద్దరేసి హీరోయిన్స్ ఉంటారు. వాళ్లూ బ్యాటు, బంతితో మాయ చేస్తారు.

  పాల్గొనే హీరోలు...

  పాల్గొనే హీరోలు...

  వెంకటేష్‌, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, అఖిల్‌, శ్రీకాంత్‌, తరుణ్‌, నితిన్‌, నాని, సందీప్‌కిషన్‌.. ఇలా క్రికెట్‌పై ఆసక్తి ఉన్న హీరోల జాబితా కాస్తంత పెద్దదే ఉంది. సీసీఎల్‌ పోటీల్లో వీళ్లంతా తమ సత్తా చాటుకొన్నవాళ్లే. ఇప్పుడు మరోసారి బరిలోకి దిగబోతున్నారు.

  ఈ మ్యాచ్ పేరు..వివరాలు

  ఈ మ్యాచ్ పేరు..వివరాలు

  'సూపర్‌ సిక్స్‌' పేరుతో నిర్వహించే ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఒకొక్క జట్టులో ఎనిమిదిమంది సభ్యులుంటారు.

  హీరోయిన్స్ ఎవరెవరు..

  హీరోయిన్స్ ఎవరెవరు..

  ఇక ఈ టీమ్ లో ఇద్దరు హీరోయిన్స్ కు చోటుంటుంది. అనుష్క, సమంత, తమన్నా, కాజల్‌, శ్రుతిహాసన్‌, ఛార్మి, ప్రియమణి మొదలైన హీరోయిన్స్ బరిలోకి దిగుతారు. కెప్టెన్లు, జట్టు వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

  వెన్యూ....

  వెన్యూ....

  30వ తేదీన హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్‌ స్డేడియంలో మ్యాచ్‌లను నిర్వహిస్తారు.

  టిక్కెట్ రేటు...

  టిక్కెట్ రేటు...

  ఈ మ్యాచ్ ని లైవ్ లో చూడాలంటే ...టికెట్ల కోసం బుక్‌ మై షో వెబ్‌సైట్‌ని సంప్రదించవచ్చు. టికెట్‌ వెల.. రూ.3 వేలు.

  ఆ లింక్ ఇదిగో..

  ఆ లింక్ ఇదిగో..

  టిక్కెట్ లు బుక్ చేసుకునేందుకు.. http://in.bookmyshow.com/events/dine-with-movie-stars/ET00025718

  మెగా డ్రా

  మెగా డ్రా

  'మేము సైతం' కోసం విరాళాలు పంపేవారిని ఉత్సాహపరిచేందుకు నిర్వాహకులు ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రూ.500, ఆపైన విరాళం అందించే ప్రతీ ఒక్కరికీ ఓ కూపన్‌ అందిస్తారు.

  డ్రా తేదీ..

  డ్రా తేదీ..

  ఈనెల 28న డ్రా నిర్వహించి ఇందులోంచి 104 మందిని ఎంపిక చేస్తారు. 30వ తేదీన మరో మెగా డ్రా ఉంటుంది. స్టార్ హీరోల చేతుల మీదుగా ఈ 104మందికి వివిధ బహుమతులు అందజేస్తారు.

  గెలిస్తే...

  గెలిస్తే...

  వీళ్లందరికీ ఆ రోజు జరిగే తారల క్రికెట్‌ మ్యాచ్‌ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశమూ కల్పిస్తారు.

   ఆంధ్రప్రదేశ్‌ చలన చిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు ఎన్‌వి ప్రసాద్‌ మాట్లాడుతూ...

  ఆంధ్రప్రదేశ్‌ చలన చిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు ఎన్‌వి ప్రసాద్‌ మాట్లాడుతూ...

  ''పంపిణీదారులు, ప్రదర్శనకారులు, 'మా', నిర్మాతల మండలి, తెలంగాణ ఫిల్మ్‌ఛాంబర్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. తారలందరూ సహకరిస్తున్నారు. కూపన్ల రూపంలో విరాళాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే కూపన్లు ప్రతీ జిల్లాకీ సరఫరా చేశాం. థియేటర్లలోనూ, జిల్లా పంపిణీ కార్యాలయాల్లోనూ ఈ కూపన్లు అందుబాటులో ఉంటాయి అన్నారు.

  శెలవు..నో షూటింగ్స్ ..

  శెలవు..నో షూటింగ్స్ ..

  30వ తేదీన పరిశ్రమకు సెలవు. ఆరోజు షూటింగులు ఉండవు. తెలుగు చలన చిత్రసీమ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది.

  తమిళం నుంచీ..

  తమిళం నుంచీ..

  రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, సూర్య, కార్తి, విజయ్‌, విక్రమ్‌ వీళ్లందరినీ ఆహ్వానించాం. అంత్యాక్షరి, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ''అన్నారు.

  బెంజ్ కారు గిఫ్ట్

  బెంజ్ కారు గిఫ్ట్

  మేముసైతం నిర్వహిస్తున్న టెలీథాన్ ప్రోగ్రాంలో లైవ్ తంబోలా ప్రోగ్రాంని నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చెయ్యడానికి ముందుగా మీరు 15,000 రూపాయలు పెట్టి తంబోలా టికెట్ ని కొనుక్కోవాలి. అలా కొనుక్కొని ఈ తంబోలా గేమ్ లో పార్టిసిపేట్ చేసి గెలుపొందిన వారికి బెంజ్ కార్ ని బహుమతిగా ఇవ్వనున్నారు.

  English summary
  ‘Memu Saitham’, all the top Tollywood stars will be playing a 4 hour cricket match at Kotla Vijayabaskar Stadium. Going into the details of this tournament, all the stars will be divided into 4 teams.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X