»   » 'ఆరెంజ్' కోసం వెళ్ళా...ఆ రాత్రి బాగా భయపడ్డా: జెనీలియా

'ఆరెంజ్' కోసం వెళ్ళా...ఆ రాత్రి బాగా భయపడ్డా: జెనీలియా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆస్ట్రేలియాలోని ఓ స్టార్ హోటల్లో మా బస ఏర్పాటు చేశారు నిర్మాత నాగబాబుగారు. ఆ హోటల్ చూడగానే స్వర్గధామం అనిపించింది. ఎన్నాళ్ళైనా అక్కడే ఉండిపోవాలన్న ఫీలింగ్. తీరా రూమ్‌కెళ్లి చూడగానే గుండె గుభేల్‌మంది. ఎక్కడ చూసినా..దెయ్యాలను, భూతాలను గుర్తుచేసే పెయింటింగ్స్. ఇక వాటిని చూస్తూ నిద్ర ఏం పడుతుంది చెప్పండి? నాకసలే దెయ్యాలంటే భయం. దీనికి తోడు ఒక షాకింగ్ న్యూస్. ఓ ఏడాది క్రితం అదే హోటల్లో ఓ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందట. అంతేకాదు ఆ అమ్మాయి దెయ్యమై ఆ హోటల్ చుట్టూనే తిరుగుతోందని, అప్పుడప్పుడు ఆ అమ్మాయి నవ్వులు, ఏడ్పులు రాత్రుళ్లు వినబడుతుంటాయని తెలిసింది. ఇక నిద్రపోతే ఒట్టు. నిజంగానే రాత్రులు ఏవో ఏడుపులు వినిపించేవి. ఈ భూత్ బంగ్లా నుంచి ఎప్పుడు బయట పడతాన్రా బాబూ..అని గంటలు లెక్కపెట్టుకున్నాను. ఏదైతేనేం..షూటింగ్ పూర్తి చేసుకొని బయట పడ్డాను. నా లైఫ్‌ లో నిజంగా మరచిపోలేని భయంకరమైన రాత్రులు ఆ హోటల్లోనే గడిపాను. అలా ఆరెంజ్ నా జీవితంలో మరపురాని అనుభూతిని నింపింది అంటూ చెప్పుకొచ్చింది జెనీలియా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu