For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చెన్నైలో ‘స్పైడర్’ ఆడియో వేడుక: మహేష్ బాబు స్పీచ్ అదుర్స్

  By Bojja Kumar
  |

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తెలుగు, తమిళ ద్విబాషాచిత్రం 'స్పైడర్' చిత్రం. ఈ చిత్రం ఆడియో వేడుక శనివారం చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పలువురు తమిళ సినీ ప్రముఖులు హాజరయ్యారు.

  ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ... తనకు 18 సంవత్సరాల నట జీవితం ఉన్నా, ఇప్పుడే హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నట్లు ఉందన్నారు. మురుగదాస్‌తో పనిచేయడం గర్వంగా భావిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.

  థ్రిల్ చేసే సినిమా

  థ్రిల్ చేసే సినిమా

  ‘స్పైడర్' చిత్రంలో నేను పోషించినపాత్ర నా మనసుకు ఎంతో దగ్గరైంది. ప్రతి ప్రేక్షకుడిని థ్రిల్ చేసే విధంగా సినిమా, కుర్చీ అంచున కూర్చునేలా చేస్తుందని మహేష్ బాబు అన్నారు.

  120 కోట్లు, నిర్మాతలకు థాంక్స్

  120 కోట్లు, నిర్మాతలకు థాంక్స్

  ‘స్పైడర్‌' సినిమా ఇంత బాగా రావడానికి నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ సినిమా కోసం రూ.120 కోట్ల ఖర్చు పెట్టినందుకు వారికి థాంక్స్. సినిమా మంచి ఫలితాలు సాధిస్తుందనే పూర్తి నమ్మకం ఉంది అని మహేష్ బాబు అన్నారు.

  మురుగదాస్‌తో

  మురుగదాస్‌తో

  మురుగదాస్‌తో చేయాలి ఎప్పటి నుండే అనుకుంటున్నాను. అప్పట్లో ‘తుపాకి' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నాం, కానీ కుదరలేదు. ‘స్పైడర్' సినిమా ద్వారా ఆయనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని మహేష్ బాబు తెలిపారు.

  ప్రీతి సీన్ తెలుగు, తమిళంలో

  ప్రీతి సీన్ తెలుగు, తమిళంలో

  ‘స్పైడర్' చిత్రంలోని ప్రతీ సీన్ తెలుగు, తమిళం రెండు భాషల్లో తెరకెక్కించాం. ‘స్పైడర్‌' గురించి మాట్లాడడానికి ఇలాంటి వేదిక కోసం రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమాను 80 రోజుల పాటు రాత్రి షెడ్యూల్‌లో షూట్ చేశాం. మహేష్ బాబు సహకారం వల్లే ఇది సాధ్యమైంది. ఆయన లేకుండా ఈ చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా తెరకెక్కించ లేకపోయేవాళ్లమేమో.' అని దర్శకుడు మురుగదాస్ తెలిపారు.

  సూపర్ స్టార్ అని వేయొద్దన్నారు

  సూపర్ స్టార్ అని వేయొద్దన్నారు

  ‘ఈ చిత్రంలో ఆయన పేరు ముందు ‘సూపర్‌స్టార్‌' అని వేయొద్దన్నారు. అభిమానులు చూపే ప్రేమ ముందు అది చాలా చిన్నదన్నారు. నాకు అవకాశం వస్తే రజనీకాంత్‌ నటించిన ‘మూండ్రుముగం' చిత్రాన్ని రీమేక్‌ చేస్తాను.' అని దర్శకుడు తెలిపారు.

  మహేష్ లుక్ రజనీకాంత్‌కు బాగా నచ్చింది

  మహేష్ లుక్ రజనీకాంత్‌కు బాగా నచ్చింది

  "రజనీకాంత్‌ గారికి ‘స్పైడర్' ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు కార్డుపై మహేష్ బాబును చూసి, ‘చిన్నప్పుడు చబ్బీగా ఉండేవాడు. ఇప్పుడు స్టైలిష్‌గా, రియల్ బాండ్‌ లా ఉన్నాడు. లుక్‌ అదిరిపోయింది అని మెచ్చుకున్నారు. ఆయన అలా అనడంతో చాలా థ్రిల్‌ ఫీల్ అయ్యాను.' అని మురుగదాస్ తెలిపారు.

  జాతీయ అవార్డు ఖాయం

  జాతీయ అవార్డు ఖాయం

  ‘ఈ చిత్రంలో పీటర్‌ హెయిన్స్‌ సమకూర్చిన యాక్షన్‌ సన్నివేశాలకు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుంది. అందుకు ఆయన అన్ని విధాలా అర్హుడు. అదే విధ:గా ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లలో హేరిస్‌ జైరాజ్‌ బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా వచ్చింది. ఎస్‌జే సూర్య విలన్‌గా చక్కగా నటించారు' అని మురుగదాస్ తెలిపారు.

  మహేష్‌ ఓ హాలీవుడ్‌ హీరో

  మహేష్‌ ఓ హాలీవుడ్‌ హీరో

  ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించిన ఎస్.జె.సూర్య మాట్లాడుతూ.... రజనీకాంత్‌కు ‘చంద్రముఖి' ఎలాంటి విజయాన్ని అందించిందో.. మహేష్‌ బాబుకు ‘స్పైడర్‌' కూడా అలాంటి బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. మహేష్‌ ఓ హాలీవుడ్‌ హీరో. సూపర్‌స్టార్‌ స్టార్‌డమ్‌ అనేది మంచి మనసుతోనే ప్రారంభమవుతుంది. దాన్ని మహేష్‌బాబు కలిగి ఉన్నారు. ఆయన అంత పెద్ద స్టార్ అయినా చాలా వినమ్రంగా ఉంటారు. ఎంతో నిబద్దత కలిగిన వ్యక్తి అన్నారు.

  వెలకం చెప్పిన విశాల్

  వెలకం చెప్పిన విశాల్

  ‘‘తమిళ చిత్ర పరిశ్రమకు మహేష్‌బాబును ఈ సినిమా ద్వారా ఆహ్వనిస్తున్నాం. ఆయనకు వెల్ కం చెప్పేందుకే నేను ఇక్కడకు వచ్చాను. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘స్పైడర్‌' ఒకటి. మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను' అని విశాల్ అన్నారు.

  కేఈ జ్ఞానవేల్ రాజా

  కేఈ జ్ఞానవేల్ రాజా

  ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా, తాను, మహేష్, కార్తి, సూర్య, దర్శకుడు వెంకట్ ప్రభు చెన్నైలోని ఒకే స్కూల్ లో చదువుకున్నామని గుర్తు చేసుకున్నాడు. మిగతా అందరితో తాను సినిమాలు చేశానని, మహేష్ తో మాత్రమే తీయలేదని, ఆ కోరిక ఇప్పుడు తీరిందని అన్నాడు.

  English summary
  Spyder Movie Audio Release Function held at Chennai. Mahesh Babu, Rakul Preet Singh, AR Murugadoss, Harris Jayaraj at the event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X