»   » మహేష్ ‘'స్పైడర్' ’: బూమ్ బూమ్ సాంగ్ కేక....గంటల్లో మిలియన్ మార్క్!

మహేష్ ‘'స్పైడర్' ’: బూమ్ బూమ్ సాంగ్ కేక....గంటల్లో మిలియన్ మార్క్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు క్రేజ్ ఏ రేంజిలో ఉందో మరోసారి రుజువైంది. ఆయన నటిస్తున్న 'స్పైడర్' మూవీ ఎప్పుడొస్తుందా అని ఆకలితో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఆ సినిమాకు సంబంధించి ఏది రిలీజైనా నమిలేస్తున్నారు.

సినిమా ప్రమోషన్లో భాగంగా 'బూమ్ బూమ్' అనే సాంగ్ బుధవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఈ సాంగుకు ఊహించని స్పందన వచ్చింది. కొన్ని గంటల్లోనే మిలియన్ మార్క్ రీచ్ అయింది. 24 గంటలు గడిచేలోపు రికార్డ్ వ్యూస్ ఖాయం అంటున్నారు విశ్లేషకులు.


అంచనాలు పెంచిన సాంగ్

‘బూమ్ బూమ్' సాంగ్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ఈ చిత్రంలో మహేష్ బాబును దర్శకుడు మురుగదాస్ సరికొత్తగా ప్రజంట్ చేశాడు. అదిరిపోయే యాక్షన్ సీన్స్, ఊహకందని ట్విటస్టులతో సినిమా ఉండబోతోంది.


తమిళంలో కూడా...

తెలుగు, తమిళంలో ‘స్పైడర్' చిత్రం తెరకెక్కుతోంది. ఏది రిలీజ్ చేసినా రెండు వెర్షన్లలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ‘బూమ్ బూమ్' సాంగ్ తెలుగు, తమిళం రెండు భాషల్లో విడుదల చేశారు. తమిళంలో కూడా ఈ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.


డిమాండ్ భారీగా

డిమాండ్ భారీగా

ఈ సినిమాకు డిమాండ్ కూడా భారీగా ఉంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకుందట. అందుకుగాను వాళ్లు 15.2 కోట్లను చెల్లించినట్టు సమాచారం. మహేష్ బాబు కెరీర్లో ఓవర్సీస్ కి సంబంధించి ఈ స్థాయి రేటు పలకడం ఇదే తొలిసారి.భారీ బడ్జెట్

భారీ బడ్జెట్

130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్పైడర్ లో మహేష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనుండగా, రకుల్ మెడికల్ స్టూడెంట్ పాత్ర పోషిస్తుంది. ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.తెర వెనక

తెర వెనక

ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌.


English summary
Spyder movie Boom Boom song released. The movie Spyder featuring Mahesh Babu, Rakul Preet Singh & Sj Surya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu