»   » టీజర్ లేదు, మోషన్ పోస్టర్ కూడా అనుమానమే: నిరాశలో మహేష్ ఫ్యాన్స్

టీజర్ లేదు, మోషన్ పోస్టర్ కూడా అనుమానమే: నిరాశలో మహేష్ ఫ్యాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్‌ 'స్పైడర్‌' చిత్రానికి ఇంతవరకు విడుదల తేదీ ఖరారు కాలేదు. కనీసం టీజర్‌ అయినా విడుదల చేసి అభిమానులని ఆనంద పెడతారని అనుకుంటే ఇప్పుడే టీజర్‌ రిలీజ్‌ చేయరాదని దర్శకుడు మురుగదాస్‌ డిసైడ్‌ అయ్యాడు. "బ్రహోత్సవం" సినిమా దారుణ పరాజయం చవిచూడడంతో, మహేష్ తదుపరి సినిమా కోసం అభిమానులు గతేడాది కాలంగా నిరీక్షిస్తున్నారు. అయితే ఎంత త్వరగా చూడాలని భావిస్తున్నారో, మరో పక్కన అది అంతకంతకూ వెనుకకు వెళ్తూ అభిమానుల సహనాన్ని పరీక్షిస్తోంది.

సెంటిమెంట్‌ని కొనసాగించడం లేదు

సెంటిమెంట్‌ని కొనసాగించడం లేదు

తన కొత్త సినిమాల టీజర్స్‌ని తన తండ్రి బర్త్‌డేకి, మే 31న విడుదల చేయడం మహేష్‌ కొంత కాలంగా ఫాలో అవుతున్నాడు. కానీ స్పైడర్‌ ఈ సెంటిమెంట్‌ని కొనసాగించడం లేదు. జూన్‌లో మహేష్ కొత్త సినిమాను చూస్తామని అనుకున్న మూవీ లవర్స్ సయితం..ఈ క్రేజీ హీరో కొత్త సినిమా ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..


ఫస్ట్ లుక్ రిలీజైంది

ఫస్ట్ లుక్ రిలీజైంది

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజైంది. టైటిల్ డిజైన్ అదిపోయిందనే టాక్ కూడా వచ్చింది. త్వరలోనే ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు., కృష్ణ పుట్టినరోజు కానుకగా మే 31న స్పైడర్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలకానుంది అన్న వార్తలతో నిన్నటిదాకా ఆనందం లో ఉన్న అభిమానులు ఒక్కసారిగా ఉస్సూరుమన్నారు.


మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌

మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌

మహా అయితే ఆ రోజున మరో మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నారట, అయితే ఇదీ పక్కా సమాచారమైతే కాదు దీనిపైకూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మురుగదాస్. . ఇది మహేష్‌ ఫాన్స్‌కి చిర్రెత్తిస్తోంది. గత ఆరేళ్లుగా వున్న సంప్రదాయాన్ని ఎందుకు చెడగొడుతున్నావంటూ మురుగదాస్‌ని తిట్టి పోస్తున్నారు.


మురుగదాస్‌కి ఇష్టం లేదట

మురుగదాస్‌కి ఇష్టం లేదట

ముప్పయ్‌ సెకన్ల టీజర్‌ విడుదల చేసే కంటెంట్‌ కూడా సిద్ధంగా లేదా అంటూ గోల పెడుతున్నారు. ఇది అన్యాయమని, ఫాన్స్‌ మనోభావాలు అర్థం చేసుకోవాలని మురుగదాస్‌ని బతిమాలుతున్నారు. అయితే మూడు భాషల్లో విడుదల చేసే ఈ చిత్రానికి హడావిడిగా టీజర్‌ కట్‌ చేయడం మురుగదాస్‌కి ఇష్టం లేదట.


ఇండియన్‌ సినిమా ఫాన్స్‌

ఇండియన్‌ సినిమా ఫాన్స్‌

టీజర్‌తో మొత్తం ఇండియన్‌ సినిమా ఫాన్స్‌ అటెన్షన్‌ రాబట్టుకునేలా వుండాలని అంటున్నాడట. అందుకే ఈ సారికి సెంటిమెంట్‌ పక్కన పెట్టేయమని మహేష్‌కి కూడా చెప్పేసాడని టాక్‌. మరోవైపు ఈ సినిమా షూటింగ్ అప్ డేట్స్ కూడా తెలిశాయి. జూన్ 2 నాటికి, 2 పాటలు మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది.


నిర్ణయం ఇంకా తీసుకోలేదు

నిర్ణయం ఇంకా తీసుకోలేదు

ఆ తర్వాత మరో 2 వారాల్లో మిగిలిన పాటల్ని కూడా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సెట్ వేసి సాంగ్స్ తీయాలా లేక ఫారిన్ వెళ్లాలనే అనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. అభిమానులు ఇంతలా ప్రాధేయపడుతున్నా... చిత్ర నిర్మాణ సంస్థ నుండి గానీ, దర్శకుడు మురుగదాస్ నుండి గానీ, ప్రిన్స్ నుండి గానీ ఒక్క అధికారిక ప్రకటన రాక పోవటం మాత్రం అభిమానుల్లో అసహనాన్ని కలిగిస్తోంది.English summary
According to film insiders buzz, the Team Spider will not going to be release the teaser on the 31st of this month on Super Star Krishna birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu