twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య 'శ్రీరామ రాజ్యం' టాక్ ఏంటి?

    By Srikanya
    |

    బాలకృష్ణ, నయనతార కాంబినేషన్ లో బాపు రూపొందించిన శ్రీరామ రాజ్యం చిత్రం ఈ రోజు అంతటా విడుదలైంది. ఉత్తరరామ చరిత్ర ఆధారంగా తండ్రీ కొడుకులు సి. పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వంలో రూపొందిన 'లవకుశ'కు రీమేక్‌గా వస్తున్న చిత్రం ఇది. దాంతో చాలా మంది పౌరాణిక చిత్రాల అభిమామలు ఈ చిత్రాన్ని లవకుశతో పోల్చి చూస్తున్నారు. వారి టాక్ ఏమిటంటే... లవకుశ సినిమాని పాడు చెయ్యలేదు.. అలాగే మరీ లవకుశ అంత గొప్పగా తెరకెక్కించలేదు అని. అయితే రీమేక్ లకు, నవలా చిత్రాలుకు ఎప్పుడూ ఈ సమస్య ఉంటుందనేది చరిత్ర ఎరిగిన సత్యం. అప్పటికే వచ్చిన సినిమాతో పోల్చి చూసి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని భావిస్తూండటం సహజంగా జరిగేదే. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ చాలా సార్లు పెద్దాయన ఎన్టీఆర్ ని గుర్తు చేసాడంటున్నారు.

    ఫస్ట్ హాఫ్ చాలా బాగున్న ఈ చిత్రం సెకెండాఫ్ లో కాస్త స్లోగా మారి ఓకే అనిపించిందని అంటున్నారు. టోటల్ గా ఓ కమనీయ కావ్యం చూసామని కొందరంటున్నారు. లవకుశలుగా వేసిన పిల్లల నుంచి మంచి నటనను బాపు రాబట్టారని చెప్తున్నారు. ముఖ్యంగా అయోధ్యలో లవకుశలు పాడే పాట చాలా హృధ్యంగా తెరకెక్కించారని, అదే సినిమాకి హైలెట్ అవుతుందని చెప్పుకుంటున్నారు. నాగేశ్వరరావు, నయనతార ఎవరకి వంక పెట్టలేని విధంగా పోటీపడి మరీ సీన్స్ పండించారని టాక్. ఓవరాల్ గా ఓ మంచి చిత్రం చూసామని, ఈ సినిమా ప్రభావంతో అయినా మళ్ళీ పౌరాణికాలు తెలుగులో మొదలైతే చూడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

    English summary
    The most eagerly awaited devotional offering of Nandamuri Balakrishna's magnum opus, Sri Rama Rajyam releasing today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X