twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీరెడ్డి హ్యాపీ మూడ్: కేసీఆర్ సర్ థాంక్స్.. నన్ను హీరోయిన్‌ను చేశారు, ఆరోజు బట్టలిప్పిన ఫలితమే!

    |

    Recommended Video

    Sri Reddy Says Thanks To Telangana CM KCR || Filmibeat Telugu

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శ్రీరెడ్డి థాంక్స్ చెప్పారు. ఆయన రియల్ హీరో అంటూ పొగడ్తలు గుప్పించారు. మహిళలు ఎదుర్కొంటున్న సెక్సువల్ హరాస్మెంట్ అంశంపై ప్రభుత్వం తరుపున ఒక ప్యానెల్(CASH-కమిటీ ఎగైనిస్ట్ సెక్సువల్ హరాస్మెంట్) ఏర్పాటు చేస్తున్నందుకుగాను ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

    సినిమా ఇండస్ట్రీలోని సెక్సువల్ హరాస్మెంట్, కాస్టింగ్ కౌచ్ అంశంపై నిరసన తెలుపుతూ గతేడాది శ్రీరెడ్డి చేసిన ఆందోళన సంచలనం అయింది. ఫిల్మ్ ఛాంబర్ ముందు ఆమె బట్టలు విప్పేసి అర్ద నగ్న నిరసన తెలుపడం జాతీయ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియాలో సైతం చర్చనీయాంశం అయింది.

    ప్రముఖుల వ్యవహారాలు బట్టబయలు

    ప్రముఖుల వ్యవహారాలు బట్టబయలు

    శ్రీరెడ్డి చేసిన ఆందోళన కారణంగా... తెలుగు సినిమా పరిశ్రమలో నెలకొన్న లైంగిక వేధింపులు, కాంస్టింగ్ కౌచ్, తమతో పడుకుంటేనే అవకాశాలు ఇస్తామని నీచంగా ప్రవర్తించే సినీ ప్రముఖుల వ్యవహారాలు బట్టబయలు అయ్యేలా చేశాయి.

    25 మంది సభ్యులతో కమిటీ

    25 మంది సభ్యులతో కమిటీ

    శ్రీరెడ్డి ఆందోళన చేసిన సరిగ్గా సంవత్సరం తర్వాత సెక్సువల్ హరాస్మెంటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం 25 మంది సభ్యులతో క్యాష్ కమిటీ ఏర్పాటు చేసింది. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి వచ్చే సెక్సువల్ హరాస్మెంట్ కేసులను ఈ కమిటీ డీల్ చేయబోతోంది. తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తోంది.

    కమిటీలో ఎవరు సభ్యులుగా ఉంటారంటే

    ఈ కమిటీలో స్టేట్ ఉమెన్ డెవల్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమీషనర్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్స్, లేబర్ డిపార్ట్‌మెంట్ కమీషనర్, షి టీమ్స్ ప్రతినిధులు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సభ్యులుగా ఉంటారని తెలుస్తోంది.

    శ్రీరెడ్డి ఎమోషనల్

    శ్రీరెడ్డి ఎమోషనల్

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీ ఏర్పాటు చేయడంతో శ్రీరెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్‌కు థాంక్స్ చెబుతూ ఫేస్ బుక్ ద్వారా ఆసక్తిక పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన మహిళా సంఘాల నేతలకు థాంక్స్ చెప్పారు.

    హీరోయిన్‌ అయ్యేలా చేశారు

    హీరోయిన్‌ అయ్యేలా చేశారు

    హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా నేను గర్వపడే సమయం ఇది. రియల్ హీరో కేసీఆర్ గారికి థాంక్స్. నా కల ఈ రోజు నిజం అవుతోంది. బి** అనే మచ్చ పడిన నన్ను ఈ లోకంలో హీరోయిన్‌ అయ్యేలా చేశారు.

    సంవత్సరం పాటు నేను అనుభవించిన బాధకు తగిన ఫలితం ఈ రోజు దక్కిందని శ్రీరెడ్డి తెలిపారు.

    నేను బట్టలు విప్పిన ఫలితమే

    నేను బట్టలు విప్పిన ఫలితమే

    నేను బట్టలు విప్పి నిరసన తెలుపడం వల్ల జరిగిన పరిణామాలతో నేడు తెలుగు సినిమా పరిశ్రమలో సెక్సువల్ హరాస్మెంట్ సమస్యలను పరిష్కరించే క్యాష్ కమిటీ ఏర్పడింది. సంధ్య, వసుధ, సజయా, తేజ్ లాంటి వారి సపోర్ట్ వల్లే నేను చేయగలిగాను.. అని శ్రీరెడ్డి వెల్లడించారు.

    English summary
    Sri Reddy posted, "Being a Hyderabadi Proud moment today..Thank u soooooooo much real hero kcr garu..my dream came true today..from mark of bitch now you made me a heroine to this world..1 year of my pain gave the birth..g.o passed by government against sexual harrassment..for movie industry committee is forming soon on sexual harrassment..now got tremendous result for my removing clothes..main persons who made this true is sandya ,vasudha,sajaya,tej love u all..for this movement heart is "apoorva"..thank u every one.."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X