»   »  రామ్ గోపాల్ వర్మ గురించి కూడా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో....

రామ్ గోపాల్ వర్మ గురించి కూడా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sri Reddy Sensational Fb Post About Rgv

సోషల్ మీడియా వేదికగా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు బాగోతాలు బయటపెడుతూ సంచలన సృష్టిస్తున్న నటి శ్రీరెడ్డి సర్వత్రా హాట్ టాపిక్ అయింది. ఆమె ఎప్పుడు ఎవరి గురించి ఎలాంటి విషయాలు బయట పెడుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా బాగా పెరిగింది. దాదాపు 60 లక్షల మంది ఆమె ఫేస్ బుక్ ఖాతాను అనుసరిస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ గురించి శ్రీరెడ్డి

రామ్ గోపాల్ వర్మ గురించి శ్రీరెడ్డి

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తాజాగా శ్రీరెడ్డి ఓ ఆసక్తికర పోస్టు చేశారు. ఆర్జీవీ సర్‌తో తీపి జ్ఞాపకాలు అంటూ..... ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసిన ఆమె ‘గాడ్ ఈజ్ మి, సెక్స్ ఈజ్ మా, ట్రూత్ ఈజ్ ఆర్జీవీ... ఇది జోక్ మాత్రమే' అంటూ ఫన్నీ కామెంట్ చేశారు.

శ్రీరెడ్డి గురించి వర్మ...

ఇటీవల శ్రీరెడ్డి అర్దనగ్న ప్రవర్శన చేసిన నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. శ్రీరెడ్డి నేషనల్ సెలబ్రిటీ అయిపోయింది అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. పవన్‌ కళ్యాణ్ అంటే‌ ఎవరో తెలియని కొందరు ముంబయి వాసులు కూడా ఇప్పుడు శ్రీరెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారు' అని ట్వీట్‌ ట్వీట్ చేశారు.

ఢిల్లీ వరకు వెళ్లిన శ్రీరెడ్డి ఇష్యూ

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్, తెలుగు వారికి అవకాశాలు ఇవ్వడం లేదనే శ్రీరెడ్డి పోరాటం ఢిల్లీ వరకు వెళ్లింది. ఇటీవల ఆమె చేపట్టిన అర్దనగ్న ప్రదర్శన ఢిల్లీ పత్రికలు సైతం కవర్ చేశాయి.

అంతర్జాతీయ స్థాయిలో కూడా

శ్రీరెడ్డి ఇష్యూ కేవలం భారత మీడియానే కాకుండా.... ఇంటర్నేషనల్ మీడియా సైతం కవర్ చేసింది. న్యూయార్క్ టైమ్స్ టాలీవుడ్లో #మీటూ ప్రొటెస్ట్ జరిగిందని, కాస్టింగ్ కౌచ్‌కు నిరసనగా శ్రీరెడ్డి టాప్‌లెస్ ప్రదర్శన చేసిందని తన కథనంలో పేర్కొంది.

English summary
"My sweet memory with RGV sir...god is me, sex is ma, truth is rgv..just a joke" Tollywood actress Sri Reddy shared a pic with RGV.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X