»   » శ్రీరెడ్డి మీద వర్మ సంచలన కామెంట్: పవన్ తెలియకున్నా ఆమె గురించి...

శ్రీరెడ్డి మీద వర్మ సంచలన కామెంట్: పవన్ తెలియకున్నా ఆమె గురించి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫిల్మ్ ఛాంబర్ ముందు బట్టలు విప్పేసి అర్దనగ్న ప్రదర్శన చేయడం లాంటి షాకింగ్ చర్యకు దిగడం ద్వారా తెలుగు నటి శ్రీరెడ్డి నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. నిన్న మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లోని మీడియాకే పరిమితమైన శ్రీరెడ్డి వ్యవహారం ఇపుడు దేశం మొత్తం పాకింది.

ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. శ్రీరెడ్డి గురించి ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. తన ట్వీట్లో శ్రీరెడ్డి నేషనల్ సెలబ్రిటీ అయిపోయింది అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.

శ్రీరెడ్డి గురించి వర్మ ప్రస్తావిస్తూ... 'శ్రీరెడ్డి నేషనల్‌ సెలబ్రిటీ అయిపోయారు. పవన్‌ కళ్యాణ్ అంటే‌ ఎవరో తెలియని కొందరు ముంబయి వాసులు కూడా ఇప్పుడు శ్రీరెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

శ్రీరెడ్డి కొన్ని రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలోని పరిస్థితులపై సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. అవకాశాలు ఇస్తామంటూ కొందరు నన్ను వాడుకున్నారని, తనకు మా సభ్యత్వం ఇవ్వడం లేదని, తనకు అన్యాయం జరిగిందని, తనకు ఎవరూ న్యాయం చేయడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ శ్రీరెడ్డి అర్దనగ్న ప్రదర్శనకు దిగడం నేషనల్ మీడియా సైతం కవర్ చేసింది.

English summary
"Sri Reddy has become a national celebrity..People in Mumbai,who don’t even know Pawan Kalyan are talking about Sri Reddy." RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X