»   » విలన్ ఆఫ్ మై లైఫ్: దగ్గుబాటి అభిరామ్ ఫోటోలతో మళ్లీ శ్రీరెడ్డి అలజడి!

విలన్ ఆఫ్ మై లైఫ్: దగ్గుబాటి అభిరామ్ ఫోటోలతో మళ్లీ శ్రీరెడ్డి అలజడి!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Sri Reddy Leaked More Photos Of Daggubati Abhiram

  ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి వాడుకున్నాడని ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి అతడితో దిగిన ఫోటోలతో సహా బయట పెట్టి ఇండస్ట్రీలో తుఫాను రేపింది. శ్రీరెడ్డి దెబ్బకు ఇండస్ట్రీ మొత్తం కదిలింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అభిరామ్ ఫోటోలు పోస్టు చేసిన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అలజడి రేపింది. విలన్ ఆఫ్ మై లైఫ్.... అంటూ ఆమె మరిన్ని ఫోటోలు లీక్ చేశారు.

  అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు

  ఒకరి జీవితాన్ని నాశనం చేయడం చాలా సులభం. కానీ ఆ జీవితాన్ని మళ్లీ నిర్మించుకోవడం చాలా కష్టం. సినిమా రంగంపై ఇష్టంతో తమ భవిష్యత్ అద్భుతంగా ఉంటుందని ఎంతో మంది అమ్మాయిలు ఎన్నో కలలతో ఇటు వైపు వస్తున్నారు. కానీ నిర్మాతలు, దర్శకులు, వారి కొడుకులు, బంధువులు అలా వచ్చే అమ్మాయిల పాలిటి విలన్స్‌లా దాపురించారు. అమ్మాయిల దేహాలను, వారి రక్తమాంసాలను తమ ఆస్తిలా భావిస్తున్నారు.... అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

  కొందరు హీరోలు కూడా...

  ఇక అమ్మాయిల జీవితాలతో కొందరు హీరోలు ఆడుకునే తీరు భిన్నంగా ఉంటుంది. ఛీ.. ఇలాంటి పరిస్థితి ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా బాధేస్తుంది. మమ్మల్ని రక్షించడానికి ఎవరు వస్తారు? మేము చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము. దయచేసి మమ్మల్ని కాపాడండి. అమ్మాయిల ఇండిపెండెంటును ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని శ్రీరెడ్డి తెలిపారు.

  ఎన్నారైలు మమ్మల్ని కాపాడాలి

  భారతీయులతో పాటు ఎన్ఆర్ఐలు ఈ విషయంలో మేల్కోవాల్సిన అవసరం ఉంది. మాలాంటి వారిని కాపాడటానికి దయచేసి ముందడుగు వేయండి. ఇండియాకు అమ్మాయిలు అవసరం. మమ్మల్ని కించపరచవద్దు. మగాళ్లందరినీ వేడుకుంటున్నాం... అంటూ శ్రీరెడ్డి తెలిపారు.

  మళ్లీ ఇప్పుడు ఎందుకు లీక్ చేసినట్లు

  అభిరామ్ ఫోటోలు మరిన్ని లీక్ చేయడం వెనక శ్రీరెడ్డి ఉద్దేశ్యం ఏమిటి? అతడి విషయంలో ఆమె తాజా ప్లాన్ ఏమిటి? తన లాయర్లతో కలిసి అభిరామ్‌ను కోర్టుకు లాగుతుందా? ఇలా రకరకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

  రూ. 5 కోట్ల సెటిల్మెంటకు నో చెప్పిన శ్రీరెడ్డి

  అభిరామ్ విషయంలో ఆమె వెనక్కి తగ్గడానికి రూ 5 కోట్లతో సెటిల్మెంట్ చేయడానికి రామ్ గోపాల్ వర్మ ప్రయత్నించారు. అయితే ఆ డబ్బు తీసుకోవడానికి ఆమె నిరాకరించారు. ఈ విషయాన్ని వర్మ స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

  కొడుకు చేసిన ఘనకార్యంపై సురేష్ బాబు సీరియస్?

  కొడుకు చేసిన ఘనకార్యంపై నిర్మాత సురేష్ బాబు చాలా సీరియస్ గా ఉన్నారు. రామానాయుడు ఫ్యామిలీ, ఆయన స్థాపించిన సినీ స్టూడియోపై ఇప్పటి వరకు ఎలాంటి మచ్చలేదు. అభిరామ్ మూలంగా బదనాం అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆయన చాలా సీరియస్‌గా ఉన్నారు.

  లీగల్‌గా ప్రొసీడ్ అవుతున్న సురేష్ బాబు

  అభిరామ్ ఇష్యూలో సురేష్ బాబు పూర్తిగా లీగల్ ప్రాసెస్ లోనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కొందరు శ్రీరెడ్డికి డబ్బు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలని సూచించినా ఆయన తోసిపుచ్చినట్లు సమాచారం. లీగల్ ప్రాసెస్ లో ఏం జరిగినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా స్వీకరించడానికి ఆయన సిద్ధం అయ్యారు.

  స్టూడియోల్లో దారుణాలు అంటూ శ్రీరెడ్డి ఆరోపణలు

  స్టూడియోల్లో దారుణాలు అంటూ శ్రీరెడ్డి ఆరోపణలు

  ఇండస్ట్రీకి వస్తున్న అమ్మాయిలపై చాలా వరకు స్టూడియోల్లోనే దారుణాలు జరుగుతున్నాయని, అవకాశాల పేరుతో వారిని లొంగదీసుకుని ఆ తర్వాత మోసం చేసి వదిలేస్తున్నారని శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను కూడా అలా మోస పోయినదాన్నే అని శ్రీరెడ్డి వెల్లడించారు.

  English summary
  Sri Reddy leaked more photos of Daggubati Abhiram. "Easy to spoil a life, but difficult to built a life, stop destroying women's dreams and future..producers and directors and their sons and relatives are main villains here in the industry they are using girls flesh as their property..heros game is differnt chi..who wl come forward to protect us..we are in very worst situation..save us please..protect girl's independence..Indians and nris please wake up,take a step to help us..india need girl child..dnt abuse us we beg all of u men." Sri Reddy said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more