»   » అవి స్టూడియోలా? బ్రోతల్ హౌసులా? దర్శకుడు తమ్మారెడ్డితో శ్రీరెడ్డి వాదన!

అవి స్టూడియోలా? బ్రోతల్ హౌసులా? దర్శకుడు తమ్మారెడ్డితో శ్రీరెడ్డి వాదన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాస్టింగ్ కౌచ్ ఇష్యూతో పాటు తెలుగు వారికి తెలుగు సినిమాల్లో అవకాశాలు ఇవ్వకపోవడం కొన్ని రోజులుగా మీడియాకెక్కి పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి..... ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డితో భేటీ అయి ఇందుకు సంబంధించిన అంశాలపై చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీరెడ్డి, తమ్మారెడ్డి మధ్య చిన్న వాదన జరిగింది.

ఆ భయంతోనే బయటకు రావడం లేదు

ఆ భయంతోనే బయటకు రావడం లేదు

కాస్టింగ్ కౌచ్ ఎదురైతే....వెంటనే బయటకు వచ్చి అలా చేసిన వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని తమ్మారెడ్డి ప్రశ్నించగా శ్రీరెడ్డి ఆసక్తికరంగా స్పందించారు. కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్న పలువురు నటీమణులు ఆ విషయం బయట పెట్టకపోవడానికి కారణం భయమే. అతడు ప్రాబ్లం చేశాడని చెప్పి కంప్లయింట్ చేస్తే నెక్ట్స్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఈ అమ్మాయి ఏదో తలనొప్పులు పెడుతోంది అని అవకాశాలు ఇవ్వడం లేదు. ఆ భయంతోనే చాలా మంది ఇలాంటి సంఘటనలు ఎదురైనా బయటకు రావడం లేదు.... అని శ్రీరెడ్డి తెలిపారు.

పెద్ద వారు కూడా ఇందులో ఉన్నారు

పెద్ద వారు కూడా ఇందులో ఉన్నారు

చిన్న చిన్న వాళ్లు కాదు. కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల్లో చాలా పెద్ద పెద్ద వారు ఉన్నారు. దానికి సంబంధించిన సమాచారం మేము గ్యాదర్ చేశాం. కచ్చితంగా వాటిని త్వరలో బయట పెడతాం అని శ్రీరెడ్డి వెల్లడించారు.

చాలా నీచంగా మాట్లాడతారు

చాలా నీచంగా మాట్లాడతారు

కొందరు డైరెక్టర్లు అసలు రెస్పెక్ట్ ఇవ్వరు. హీరోయిన్ ఎదురుగా ఉంటే పాప అంటారు. పక్కకు వెళ్లిన తర్వాత *** అంటారు. రెస్పెక్ట్ ఇవ్వరు. దీంతో అసిస్టెంట్లు కూడా డైరెక్టర్లు అయిపోయిన తర్వాత హీరోయిన్ల పట్ల అలాగే ప్రవర్తిస్తుంటారు. నేను అందరిని ఉద్దేశించి ఇలా అనడం లేదు, కొంత మంది ఇలా తయారు చేస్తున్నారు కాబట్టి, తెలుగు సినిమా పరిశ్రమకు చీడ పరుగుల్లా తయారయ్యారు కాబట్టి వారిని మార్చాలనేది నా ఉద్దేశ్యం.... అని శ్రీరెడ్డి తెలిపారు.

ఇలాంటి రూల్స్ పెట్టాలి

ఇలాంటి రూల్స్ పెట్టాలి

ప్రస్తుతం ఉన్న సిస్టం ఏదైతే ఉందో అది మారాలి. తెలుగు అమ్మాయిలను తప్పకుండా తీసుకోవాలనే రూల్స్ పెట్టాలి. అది జరిగే వరకు తాము పోరాడుతూనే ఉంటాము అని శ్రీరెడ్డి వెల్లడించారు.

అవి స్టూడియోలా? బ్రోతల్ హౌసులా?

అవి స్టూడియోలా? బ్రోతల్ హౌసులా?

తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరిట ఫ్రీగా భూములు దొబ్బి స్టూడియోలు కట్టించుకున్నారు. అందులో చాలా చీకటి పనులు జరుగుతున్నాయి. కళా రంగానికి సేవ చేస్తామని కోట్ల రూపాయల విలువ చేసే భూములు తీసుకుని శృంగారానికి ఎలా వాడుకుంటారు? అవేమైనా బ్రోతల్ హౌసులా? స్టూడియోలా? అంటూ శ్రీరెడ్డి వాదనకు దిగారు. దీనికి తమ్మారెడ్డి వెంటనే స్పందిస్తూ బ్రోతల్ హౌస్ అనే పదం చాలా పెద్ద పదం అంటూ ఆమె వాదనను ఖండించే ప్రయత్నం చేశారు. సార్... మీకు ఈ విషయాలన్ని తెలియక పోవచ్చు. అనుభవించి, నలిగిపోయిన వారం మేము. వాటిని ప్రూఫులతో సహా బయట పెడతాం అని శ్రీరెడ్డి తెలిపారు.

రైడ్స్ చేస్తే చాలా మంది బడాబాబులు దొరుకుతారు

రైడ్స్ చేస్తే చాలా మంది బడాబాబులు దొరుకుతారు

చాలా మంది బడాబాబులు బయట లాడ్జిల్లో దొరికిపోతామని సినిమా స్టూడియోల్లో రంకుబాగోతాలు నడుపుతున్నారు. లాడ్జిల్లో 500, 200లకు వెళ్లే చిన్న చిన్న వారిని పట్టుకుని ఏదో పెద్ద స్ట్రింగ్ ఆపరేషన్లు చేశామని చెప్పడం కాదు. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు కాకుండా ఇలాంటి బడాబాబుల తాటలు ఒలవాలంటే స్టూడియోలకు వెళ్లి రైడ్స్ చేయండి. చాలా మంది దొరుకుతారు అని శ్రీరెడ్డి తెలిపారు.

English summary
Actress Sri Reddy Reveals Celebs Involved in CASTING COUCH in Latest Interview with Tammareddy Bharadwaj. Sri Reddy / Sree Reddy also speaks few more interesting points about Tollywood celebrities real characters.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X