»   »  నడిరోడ్డుపై నగ్నంగా నిలబడుతా, నిరాహార దీక్ష.. కేసీఆర్‌ని కోరుతూ శ్రీరెడ్డి సంచలనం!

నడిరోడ్డుపై నగ్నంగా నిలబడుతా, నిరాహార దీక్ష.. కేసీఆర్‌ని కోరుతూ శ్రీరెడ్డి సంచలనం!

Subscribe to Filmibeat Telugu
Sri Reddy Sensational Comments on Telangana CM KCR

గత కొన్ని రోజులుగా మీడియాలోనూ, సామజిక మాధ్యమాల్లోనూ నటి శ్రీరెడ్డి సంచలనంగా మారింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, అంతే ఘాటుగా సంచలనమైన లీకులు ఇస్తూ హల్ చల్ సృష్టిస్తోంది. శ్రీరెడ్డి వ్యాఖ్యలు టాలీవుడ్ వార్తల్లో కాక రేపుతున్నాయి. తనకు టాలీవుడ్ లో ప్రముఖులు అన్యాయం చేసారని శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ లో జరుగుతున్న దారుణాలు గురించి శ్రీరెడ్డి మాట్లాడుతోంది. తాజగా శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి.

కాస్టింగ్ దారుణాలు

కాస్టింగ్ దారుణాలు

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పేరుతో జరుగుతున్న దారుణాలు గురించి శ్రీరెడ్డి సంచలన విషయాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలువురు ప్రముఖల విషయంలో శ్రీరెడ్డి మీడియాకు లీకులు ఇస్తోంది.

అవకాశాల పేరుతో వాడుకుంటున్నారు

అవకాశాల పేరుతో వాడుకుంటున్నారు

టాలీవడ్ ప్రముఖులు వర్ధమాన హీరోయిన్లని అవకాశాల పేరుతో వాడుకుని వదిలేస్తున్నారని శ్రీరెడ్డి మాట్లాడుతూ మీడియా ముందుకు వచ్చింది. శ్రీరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలో ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి.

కేసీఆర్ ని కోరుతూ

కేసీఆర్ ని కోరుతూ

శ్రీరెడ్డి తాజాగా తన పేస్ బుక్ ఖాతాలో సంచలనాత్మక పోస్ట్ పెట్టింది. టాలీవుడ్ లో జరుగుతున్న అన్యాయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని కోరుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

నిరాహార దీక్ష చేస్తా

నిరాహార దీక్ష చేస్తా

కేసీఆర్ తమ భాదని అర్థం చేసుకుని స్పందించాలని శ్రీరెడ్డి కోరింది. ఆయన స్పందించకపోతే నిరాహార దీక్షకు దిగుతా అంటూ అల్టిమేటం జారీ చేసింది.

నడిరోడ్డుపై నగ్నంగా

అప్పటికి కేసీఆర్ గారు స్పందించకపోతే తాను తీసుకోబోయే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుందని హెచ్చరించింది. తరువాత తనపోరాటాన్ని మరింత ఉదృతం చేసేలా నడిరోడ్డులో నగ్నంగా నిలబడి తన నిరసన తెలియజేస్తా అంటూ సంచలన ప్రకటన చేసింది.

English summary
Sri Reddy sensational FB post requesting CM KCR. She asks to respond KCR on her demands
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X