»   » సెటిల్మెంట్లకు లొంగను, ఇక చెప్పు దెబ్బలే: ఆ ఐదుగురికి శ్రీరెడ్డి వార్నింగ్

సెటిల్మెంట్లకు లొంగను, ఇక చెప్పు దెబ్బలే: ఆ ఐదుగురికి శ్రీరెడ్డి వార్నింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాస్టింగ్ కౌచ్, 24 క్రాఫ్ట్స్‌లోని సమస్యలు, తెలుగు వారికి కాకుండా బయటి రాష్ట్రాల వారికి అవకాశాలు ఇవ్వడం, సినిమా పరిశ్రమలో ఐదు కుటుంబాలు నియంతల్లా వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యమం ప్రారంభించిన శ్రీరెడ్డి... దీన్ని మరింత ఉధృతం చేస్తోంది. తాజాగా ఐదు కుటుంబాలకు వార్నింగ్ ఇస్తూ తన ఫేస్ బుక్ పేజీలో ఓ బహిరంగ లేఖ సంధించింది. ఈ సందర్భంగా చెప్పుదెబ్బలు రెడీగా ఉండండి అంటూ ఆమె వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఆమె తన లేఖలో పేర్కొన్న విషయాలను బట్టి ఆ 5 కుటుంబాల వల్ల నష్టపోయిన వారందరినీ శ్రీరెడ్డి ఒకేతాటిపైకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

 చెప్పుదెబ్బలకు రెడీగా ఉండండి

చెప్పుదెబ్బలకు రెడీగా ఉండండి

పెత్తందారులైన 5 కుటుంబాల నియంత వ్యవహార శైలిపై మా యుద్ధం ఊపందుకుంది. బ్యాక్ టు బ్యాక్ మీటింగులతో ఎంతో మందిని కలిసి ప్రాబ్లమ్స్ అన్ని నోట్ చేసుకుంటున్నాం. విప్లవాగ్ని తో రగిలిపోతున్నాం. మీ మీద విజయం కోసం తహతహ లాడుతున్నాం. మీ బడా ఫ్యామిలీస్‌ను ఎదుర్కొంటాం. మీ పైత్యాన్ని జనాల ముందు ఎండగడతాం. మమ్మల్ని ఎవరూ ఆపలేరు. చెప్పు దెబ్బల కోసం ఎదురు చూడండి.... అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

షూటింగ్స్ ఎలా చేస్తారో చూస్తాం

షూటింగ్స్ ఎలా చేస్తారో చూస్తాం

షూటింగ్స్ ఎలా చేస్తారో చూస్తాం. లోకల్‌గా ఉన్న వారికి తిండి పెట్టకుండా బయట రాష్ట్రాల వారికి పరమాన్నం ఎలా ఎడతారో చూస్తాం. మీ బ్లాక్ మనీ ఎక్కడ దాస్తున్నారో, ప్రభుత్వం నోరు, మీడియా నోరు మీరు ఎలా నొక్కాలని ప్రయత్నిస్తున్నారో ప్రపంచానికి చాటుతాం. మీ కంటితుడుపు చర్యలకు సిద్ధంగా లేము. మీ కొడుకులు, మీ మనుమలు మా అందరి రాజ్యాన్ని ఎలా ఏలుతున్నారో, ఎలా అందరి డబ్బు కొల్లగొడుతున్నారో అందరికీ తెలిసేలా చేస్తామన్నారు.

సెటిల్మెంట్లకు లొంగను

సెటిల్మెంట్లకు లొంగను

ఊపిరి తీద్దామని మీరు ఎన్ని బెదిరింపులు, సెటిల్మెంట్లు, ఎన్ని ప్లాన్స్ చేసి కాల్ చేసినా నేను వినను. 85 సంవత్సరాల ఈ ఇండస్ట్రీకి ఇండిపెండెన్స్ ఇప్పించడంలో మేము అందరం ప్రాణాలకు తెగించి పోరాడతాం. ఈ ఉద్యమంలో ఈ సంఘానికి సంబంధించిన నేతలైన శ్రీరెడ్డి పేరుతో చేసే వసూళ్లకు మేము బాధ్యులము కాదు. ఇవ్వకూడదని నా మనవి, బ్లాక్ మెయిల్ చేసినచో మా దృష్టికి తీసుకురావాలని శ్రీరెడ్డి తెలిపారు.

మిమ్మల్ని కోర్టు బోనులు ఎక్కిస్తాం

మిమ్మల్ని కోర్టు బోనులు ఎక్కిస్తాం

ప్రపంచ విప్లవ వీరుడు చెగోవీరా మా ఆదర్శం. మార్పు వీలైనంత తొందరగా తీసుకురాకపోతే నా చెప్పు దెబ్బలకు రెడీ అవ్వండి. మీ పిచ్చి కుక్కలు స్వైర విహారానికి బోనులు తయారు చేస్తున్నాం. మిమ్మల్ని కూడా కోర్టు బోనులు ఎక్కిస్తాం. మీరు, మీ కొడుకులు నల్ల డబ్బుతో చేసే అకృత్యాలకు చరమగీతం పాడుతాం. స్టూడియోల మీద ఎంత సంపాదిస్తున్నారో, డిస్ట్రిబ్యూషన్ మీద మీ పెత్తనాలు, యూఎఫ్ఓ, క్యూబ్ పేరుతో రక్తం పీల్చే జలగల్లాగా చిన్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, చిన్న హీరో నుండి ఆర్టిస్టుల పాలిట దరిద్రంలా ఎలా దాపురించారో అందరికీ తెలియజెబుతాం.

మమ్మల్ని తొక్కేయలేరు

మమ్మల్ని తొక్కేయలేరు

ప్రతి ఒక్కడు మంచి వాడు ముసుగు వేసుకుని స్వామి మాలలు వేసుకుని మంచి వాళ్ల లాగా చలామణి ఎలా అవుతున్నారో ముసుగు తీసి నిజస్వరూపం చూపిస్తాం. ప్రతి పైసా ఎం చేస్తున్నారో ఏం సేవా కార్యక్రమాలు ఎక్కడ చేశారో చూపాలి అని మా అసోసియేషన్ తో సహా సవాల్ చేస్తున్నాం. విప్లవ కారుల ఐకాన్ చెగోవీరా మా ఆదర్శ మూర్తి, మా ఉద్యమాన్ని తొక్కేయడం మీ వల్ల కాని పని... అని శ్రీరెడ్డి తేల్చి చెప్పారు.

English summary
Sri Reddy warning to Tollywood Big families. She said bad days are ahead for people of big families in Telugu industry. She said they won't accept Tollywood Big families Decisions in CASH Committee.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X