»   » శ్రీవిష్ణు మూవీ ‘నీది నాది ఒకే కథ’ రిలీజ్ డేట్ ఖరారు

శ్రీవిష్ణు మూవీ ‘నీది నాది ఒకే కథ’ రిలీజ్ డేట్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం 'నీది నాది ఒకే కథ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ ఖరారైంది. మార్చి 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తేబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

'నీది నాది ఒకే కథ' చిత్రం ద్వారా వేణు ఉడుగుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇందులో చిత్తూరు యాషలో హీరో చెప్పిన డైలాగులకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Sri Vishnu’s ‘Needi Naadi Oke Katha’ To Release On March 23rd

శ్రీవిష్ణు సరసన సత్నా టిటుస్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆరన్ మీడియా వర్క్స్ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతానికి రెస్పాన్స్ బావుంది. ఇప్పటికే విడుదలైన 4 పాటలకు మంచి స్పందన వచ్చింది.

తారాగణం: శ్రీవిష్ణు, సత్నా టిటుస్, పోసాని కృష్ణ మురళి, దేవి ప్రసాద్
నిర్మాతలు: ప్రశాంతి, కృష్ణ విజయ్ మరియు అట్లూరి నారాయణ రావు
బేనర్: ఆరన్ మీడియా వర్క్స్, శ్రీ వైష్ణవి క్రియేషన్స్
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రపీ: రాజ్ తోట
ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
ఆర్ట్: టిఎన్ ప్రసాద్
రచన, దర్శకత్వం: వేణు ఉడుగుల

English summary
Highly anticipated Sri Vishnu starrer ‘Needi Naadi Oke Katha’ is all set to release on March 23rd. The film has garnered huge buzz ever since release of the teaser. Sri Vishnu’s striking dialogues in Chittoor slang have received terrific response. Four songs composed by Suresh Bobbili have won the applause of music lovers. The youthful entertainer is directed ‘Needi Naadi Oke Katha’ is directed by Venu Udugula.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu