»   » కూతురు సినిమా రంగంలోకి రావడంపై శ్రీదేవి స్పందన

కూతురు సినిమా రంగంలోకి రావడంపై శ్రీదేవి స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటి శ్రీదేవి కూతురు జాహ్నవి త్వరలో సినిమాల్లోకి వస్తోందని, హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘పులి' సినిమా ప్రమోషన్లో పాల్గొంటున్న శ్రీదేవికి తన కూతురుకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

తన పెద్ద కూతురు సినిమాల్లో వస్తుందన్న వార్తలను ఆమె ఖండించారు. జాహ్నవి ప్రస్తుతం డిగ్రి పూర్తి చేసి పై చదువులపై దృష్టి పెట్టిందని, ఇప్పటి వరకు ఎలాంటి సినిమా కూడా అంగీకరించలేదని స్పష్టం చేసింది. జాహ్నవి చదువుపైనే దృష్టి పెట్టాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపింది. యాక్టింగ్ అనేది ఈజీ జాబ్ కాదన్నారు. దానికి ఎంతో హార్డ్ వర్క్ అవసరం. భవిష్యత్తులో ఆమె సినిమాల్లోకి వస్తుందా? రాదా? అనేది నేను ఇప్పడు చెప్పలేదు, ఆమె సినిమాల్లోకి రావాలని రాసిపెట్టి ఉంటే తప్పకుండా వస్తుందన్నారు.

విజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పులి' చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను ఇండియన్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి' రేంజిలో ఉంటుందని అంటున్నారు. అయితే నిర్మాతలు మాత్రం ‘పులి' సినిమా డిఫరెంటుగా ఉంటుందని అంటున్నారు.

Sridevi About Jhanvi Kapoor's Bollywood Debut

పిల్లలను, పెద్దలను, అభిమానులను అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉంటుందని అంటున్నారు. మరో వైపు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ ‘యు' సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో సినిమాకు ఫ్యామిలీ ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు.

శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్ కె టి స్టూడియోస్ బ్యానర్‌పై శింబు తమీన్స్, పి టి సెల్వకుమార్ నిర్మాతగా నిర్మిస్తున్న పులి చిత్రం భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. తెలుగులో చిత్రాని ఎస్ వి ఆర్ మీడియా బ్యానర్‌పై సి జె శోభ విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాలో శ్రీదేవి కూడా నటిస్తున్నారు. సినిమాలో ఆమె కీలకమైన పాత్రలో మహారాణిగా కనిపించబోతున్నారు. విజయ్‌ సరసన శృతి హాసన్‌, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. కన్నడ స్టార్‌ సుదీప్‌, ప్రభు, తంబి రామయ్య, సత్యన్‌, జూనియర్‌ బాలయ్య, నరేన్‌, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రితో పాటు 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.

English summary
"Which child is not interested in acting? Every child wants to be an actor. And there is nothing wrong with that. But it is not an easy job. It requires a lot of hard work and dedication. If they are ready to put in that effort, then why not?" Sridevi About Jhanvi Kapoor's Bollywood Debut.
Please Wait while comments are loading...