»   » శివగామి పాత్ర గొప్పేంటో.. బాహుబలి చూడలేదు.. శ్రీదేవి షాకింగ్ సమాధానం..

శివగామి పాత్ర గొప్పేంటో.. బాహుబలి చూడలేదు.. శ్రీదేవి షాకింగ్ సమాధానం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారతీయ సినిమా చరిత్రలో రికార్డులు సృష్టించిన చిత్రంగా బాహుబలి ఓ ఖ్యాతిని దక్కించుకొన్నది. బాహుబలి1, బాహుబలి1 చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్కరికి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు నీరాజనం పట్టారు. అయితే ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రగా చెప్పుకొనే శివగామి పాత్రకు ముందుగా ఒకప్పటి, ఇప్పటికీ గ్లామర్ తార అయిన శ్రీదేవిని అనుకొన్నారు. కొన్ని కారణాల వల్ల శివగామి పాత్రను చేయడానికి శ్రీదేవి నిరాకరించడం వివాదాస్పదంగా మారింది. మామ్ సినిమా ప్రమోషన్ సందర్భంగా శ్రీదేవి ఆ వివాదంపై స్పందించారు.

బాహుబలి చూడలేదు..

బాహుబలి చూడలేదు..

నేను బాహుబలి సినిమాను చూడలేదు. ఆ సినిమా గురించి మాట్లాడటం తగదు. ఒకవేళ ఆ సినిమా చూసి ఉంటే నేను స్పందించేదానిని. అందులో పాత్రను నిరాకరించడం వల్ల నేను బాధపడటం లేదు. ఆ పాత్రను వదులుకోవడం వల్ల నా ప్రతిష్ఠకు వచ్చిన ముప్పేమీ లేదు అని శ్రీదేవి అన్నారు.


కారణాలు వేరు..

కారణాలు వేరు..

బాహుబలి పాత్ర కోసం నన్ను సంప్రదించిన విషయం వాస్తవమే. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నిరాకరించాను. ఆ కారణాలు ఏమిటనేవి ఇప్పుడు అప్రస్తుతం. దానినో పెద్ద వివాదంగా మలచడం సరికాదు అని శ్రీదేవి పేర్కొన్నారు. శివగామి పాత్ర కోసం భారీ రెమ్యూనరేషన్, లాభాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


ఎందుకు వివాదం చేస్తున్నారు..

ఎందుకు వివాదం చేస్తున్నారు..

ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా తర్వాత నేను చాలా సినిమాలు ఒప్పుకోలేదు. అందుకు సంబంధించిన నాకు కొన్ని పట్టింపులు ఉన్నాయి. బాహుబలి తర్వాత నేనేతో నేరం చేసినట్టు ఫీలవుతున్నారు. బాహుబలికి ముందు నేను చాలా సినిమాలు ఒప్పుకోలేదు. వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు. బాహుబలి గురించే వివాదం చేస్తున్నారు అని ఆమె ప్రశ్నించారు.


సినీరంగంలో శ్రీదేవికి 50 ఏళ్లు

సినీరంగంలో శ్రీదేవికి 50 ఏళ్లు

ప్రస్తుతం శ్రీదేవి మామ్ సినిమా ప్రమోషన్‌పైనే దృష్టిపెట్టింది. ఈ చిత్రం జూలై 7వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రం రిలీజ్ డేట్ శ్రీదేవికి చాలా ప్రత్యేకమైనది. శ్రీదేవి సినీరంగంలోకి ప్రవేశించి ఆ తేదీకి 50 ఏళ్లు పూర్తవుతాయి. అదే రోజున మామ్ చిత్రాన్ని రిలీజ్ చేసి శ్రీదేవి అరుదైన గిఫ్ట్‌ను అందించాలని నిర్మాత, భర్త బోనీ కపూర్ ప్లాన్ చేశాడు.English summary
The actress Sridevi informed that she hasn't seen the film adding, "But I would like to talk about this. It has become such a big issue and people are imagining things (as to why I have said no the film). I have my own reasons. First of all two parts of Baahubali have come out, and now they are asking me. There are many films, I refused. Why are they not talking about it? Why only this film? I will go there and talk about it.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu