»   » శ్రీదేవి బాత్‌టబ్‌లో పడి చనిపోవడమా? నమ్మను.. మరణించినా.. వెంటాడుతున్న అనుమానాలు.. .

శ్రీదేవి బాత్‌టబ్‌లో పడి చనిపోవడమా? నమ్మను.. మరణించినా.. వెంటాడుతున్న అనుమానాలు.. .

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల తార శ్రీదేవి మరణం నుంచి అభిమానులు, సన్నిహితులు బయటపడలేక పోతున్నారు. ప్రమాదవశాత్తూ మరణించారని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ రిపోర్టు ఇచ్చిన నమశక్యంగా లేదంటూ పలువురు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పలు అనుమానాలను ప్రముఖ కోరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ వ్యక్తం చేశారు.

ఖలీజ్ టైమ్స్

ఖలీజ్ టైమ్స్

శ్రీదేవి మృతిపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో దుబాయ్‌కి చెందిన ఖలీజ్ టైమ్స్, గల్ఫ్ న్యూస్ ప్రచురించిన భిన్న కథనాలు అనేక అనుమానాలకు దారి తీశాయి. బోనికపూర్‌ను మూడు గంటలపాటు విచారించారు అని గల్ఫ్ న్యూస్ కథనాన్ని ప్రచురించింది.

Boney Kapoor Finally Responds On Sridevi's Loss
పోలీస్ దర్యాప్తు

పోలీస్ దర్యాప్తు

బోనికకపూర్ నుంచి కేవలం వాగ్మూలం తీసుకొన్నారు అని ఖలీజ్ టైమ్స్ కథనాన్ని వెలువరించింది. దుబాయ్ పోలీస్ దర్యాప్తు చట్టాల ప్రమాణాల ప్రకారమే బోని నుంచి సాక్ష్యం తీసుకొన్నారు. జుమీరా ఎమిరేట్స్ టవర్ హోటల్‌లో జరిగిన ఘటనపై బోని నుంచి ఆరా తీశారు అని ఖలీజ్ టైమ్స్ పేర్కొన్నది.

ప్రధాన పత్రికల

ప్రధాన పత్రికల

దుబాయ్‌లోని ప్రధాన పత్రికల కథనం వేర్వేరుగా ఉండటం వలన శ్రీదేవి మృతి మరింత గందరగోళంగా మారింది. అయితే బోనిని ఇంటరాగేట్ చేయలేదు. కేవలం వాగ్మూలం తీసుకొన్నారు అని కాన్సులేట్ ప్రకటన చేయడంతో కొంత ఉపశమనం కలిగింది.

బోని ముంబై పర్యటన

బోని ముంబై పర్యటన

ఇక శ్రీదేవి మృతి వ్యవహారంలో బోని ముంబై పర్యటన అనేక అనుమానాలకు తావిస్తున్నది. తన మేనల్లుడి పెళ్లి జరుగగానే కూతురు ఖుషీని వెంటపెట్టుకొని ముంబై వెళ్లడం చర్చనీయాంశమైంది. అయితే వెంటనే ముంబై నుంచి దుబాయ్‌కి రావాల్సిన అవసరం ఏముందనే వాదన కూడా వినిపిస్తున్నది.

శ్రీదేవికి ఆశ్చర్యపరిచే

శ్రీదేవికి ఆశ్చర్యపరిచే

దుబాయ్‌లో ఒంటరిగా ఉన్న శ్రీదేవికి ఆశ్చర్యపరిచే విధంగా బోని అక్కడి వెళ్లడం చర్చనీయాంశమైంది. హోటల్‌కు చేరుకొన్న తర్వాత బోని, శ్రీదేవి కొంతసేపు మాట్లాడుకొన్నారు. ఆ తర్వాతనే బ్రాత్రూంలోకి వెళ్లి శ్రీదేవి మరణించింది అని బోని చెప్పారు. నేలమీద పడిన ఆమెను తన స్నేహితుడి సహాయంతో హాస్పిటల్‌కు చేర్చాను అని బోని తన వెర్షన్‌ను వినిపించాడు.

బోని కపూర్ వెర్షన్

బోని కపూర్ వెర్షన్

శ్రీదేవి మరణంపై బోని కపూర్ వెర్షన్ అలా ఉంటే హోటల్ సిబ్బంది చెప్పిన విషయాలు పొంతన లేకుండా ఉన్నాయి. రూంనంబర్ 2261 నుంచి సర్వీస్ కావాలని ఫోన్ వచ్చింది. సర్వీస్ అందించడానికి వెళితే తలుపు తీయలేదు. దాంతో మేనేజ్‌మెంట్‌కు సమాచారం అందించి తలుపులను బలవంతంగా తీశాం. అపస్మారక స్థితిలో ఉన్న శ్రీదేవిని ఆస్పత్రికి తరలించాం అని సిబ్బంది చెప్పారు.

సరోజ్ ఖాన్ స్పందిస్తూ

సరోజ్ ఖాన్ స్పందిస్తూ

శ్రీదేవి మ‌ృతిపై సరోజ్ ఖాన్ స్పందిస్తూ.. ఆమె బాత్‌టబ్‌లో మునిగి చనిపోయిందా? నమ్మశక్యంగా లేదు. ఆమె ఎలా బాత్‌టబ్‌లో ఎలా మునుగుతుంది అనే సందేహాన్ని వ్యాఖ్యలు చేసింది. శ్రీదేవి మృతి వెనుక కారణాలపై సరైన వివరణ లేదనే వాదన వ్యక్తం చేసింది.

బాత్‌టబ్‌లో మునిగి

బాత్‌టబ్‌లో మునిగి

శ్రీదేవి బాత్‌టబ్‌లో మునిగి చనిపోయిందనే వివరణపై ప్రముఖ నటి సిమీ గారేవాల్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. హాలీవుడ్ నటి విట్నీ కూడా బాత్‌టబ్‌లో మునిగి చనిపోయింది అని శ్రీదేవి మరణానికి పోల్చడం సరిగా లేదు. విట్నీ పూర్తిగా మద్యం మత్తులో ఉన్న తర్వాత బాత్‌టబ్‌లో మునిగింది అని సిమీ పేర్కొన్నది.

ప్రమాదవశాత్తూ జరిగిన

ప్రమాదవశాత్తూ జరిగిన

శ్రీదేవిది సహజ మరణం కాదు.. ప్రమాదవశాత్తూ జరిగిన మృతి కాదు అని రాజకీయ నేత సుబ్రమణ్యస్మామి అన్నారు. శ్రీదేవిది ముమ్మాటికి హత్యే అని పేర్కొనడం సంచలనం రేపింది. దర్యాప్తు జరిగిన తీరుపై అనేక అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.

చెప్పడానికి సీసీటీవీ

చెప్పడానికి సీసీటీవీ

శ్రీదేవి మరణం మిస్టరీ కాదు అని చెప్పడానికి సీసీటీవీ ఫుటేజ్‌ను హోటల్ సిబ్బంది విడుదల చేయాల్సింది. దాంతో ప్రజలకు ఉన్న అనుమానాలు ఖచ్చితంగా తీరేవి అని సుబ్రమణ్యస్వామి అన్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు విడుదల చేయలేదు అని ప్రశ్నించారు.

స్వామి బాంబు

స్వామి బాంబు

శ్రీదేవి మరణం వెనుక గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉంది అని సుబ్రమణ్య స్వామి బాంబు పేల్చడం మరింత సంచలనంగా మారింది. దావూద్ పాకిస్థాన్‌లో తలదాచుకొన్నప్పటికీ బాలీవుడ్‌తో సంబంధాలు ఉన్నాయి అని ఆయన చెప్పడం గమనార్హం.

English summary
The internet is dark and full of terrors! Nothing shuts off despite the authorities completing investigations from all angles by questioning Sridevi's husband Boney Kapoor, Mohit Marwah and his family, the hotel staff and gave a report of "accidental drowning" as the cause of death. The conspiracy theories are still afloat on the Internet and questions are being raised about the authenticity of the whole investigation. To add fuel to fire, conspiracy theorists held on to choreographer Saroj Khan's statement saying, "How can bathtub drown her (Sridevi)?" and Simi Garewal observed similarities between Sridevi and Whitney Houston's demise. Below are the details of the conspiracies floating around on Sridevi's death!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu