twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి ఉంటే బాహుబలి ప్లాప్ అయ్యేది, టూమచ్ రెమ్యూనరేషన్: రాజమౌళి

    శ్రీదేవి భారీ రెమ్యూనరేషన్ తో పాటు హిందీ లాభాల్లో పర్సంటేజ్ కూడా అడిగారని, అందుకే ఆమెను వద్దనుకున్నట్లు రాజమౌళి తెలిపారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాహుబలి రెండు పార్టుల్లోనూ శివగామి పాత్ర ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలో అత్యంత కీలకమైన పాత్రల్లో ఇదీ ఒకటి. ఈ పాత్ర పోషించి రమ్య కృష్ణ వందకు వందశాతం న్యాయం చేసారు. బాహుబలి సినిమా మరో లెవల్‌కి వెళ్లడానికి ఆమె కూడా ఓ కారణం.

    అయితే శివగామి పాత్రకు మొదట రమ్యకృష్ణను అనుకున్నప్పటికీ తరువాత మార్కెట్‌ పెంచాలనే దృష్టిలో హిందీ యాక్టర్స్‌ పెడితే బాగుంటుంది అని ఆలోచన చేసారట. అందుకే ప్రముఖ నటి శ్రీదేవితో సంప్రదింపులు జరిపినట్లు రాజమౌళి తెలిపారు. మా అదృష్టం బాగుండి ఆవిడ సినిమాను ఓకే చేయలేదు అని రాజమౌళి ఇటీవల ఆర్కే ఇంటర్వ్యూలో తెలిపారు.

    మొత్తం పోయిండేది

    మొత్తం పోయిండేది

    ఒక వేళ శివగామి పాత్రలో రమ్యకృష్ణకు బదులు శ్రీదేవిని పెట్టుంటే సినిమా పోయుండేది కదా? అని ఆర్కే అడిగిన ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ...... అవును మొత్తం పోయిండేది అని రాజమౌళి తెలిపారు.

    శ్రీదేవి ఎంత అడిగిందో తెలునా?

    శ్రీదేవి ఎంత అడిగిందో తెలునా?

    శివగామి పాత్ర చేయాలని శ్రీదేవి గారిని స్పందించిపుడు ఆమె భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసారని రాజమౌళిపారు. రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు ఆమె షూటింగుకు వచ్చిన ప్రతిసారి 5 బిజినెస్‌ క్లాస్‌ ఫ్లైట్ టిక్కెట్లు, బిగ్గెస్ట్‌ హోటల్‌లో 5 సూట్లు... ఏర్పాట్లు చేయాలని ఆమె కోరినట్లు రాజమౌళి తెలిపారు.

    అది మరీ టూమచ్

    అది మరీ టూమచ్

    శ్రీదేవి భారీగా రెమ్యూనరేషన్ అడిగినప్పటికీ హిందీ రిలీజ్ ద్వారా కవర్ చేసుకోవచ్చని ఆమెతో డీల్ కుదుర్చుకుందామనుకున్నాం. కానీ ఆమె హిందీలో రిలీజ్‌లో లాభాల పర్సంటేజ్‌ కూడా అడిగారు. ఇదీ మరీ టూమచ్‌. ఇలా అయితే వర్కౌట్ కాదని వదిలేసామని రాజమౌళి తెలిపారు.

    అంతా మన మంచికే జరిగిందని సంతోషంలో రాజమౌళి

    అంతా మన మంచికే జరిగిందని సంతోషంలో రాజమౌళి

    శ్రీదేవి గారితో డీల్ ఓకే కాక పోవడం అంతా మా మంచి కోసమే జరిగింది. ఒక వేళ ఆమెతో సినిమాచేసి ఉంటే ‘బాహుబలి' పరిస్థితి ఎలా ఉండేదో అని రాజమౌళి తన అభిప్రాయం వ్యక్తం చేసారు.

    English summary
    As per Director Rajamouli, Sridevi was offered the role of Sivagami Devi in Baahubali franchise. Not Ramya Krishnan but Sridevi was SS Rajamouli's first choice to play the powerful queen. The Bollywood actor turned down the offer because her demands were not met. Reportedly, she demanded a whopping Rs 8 crore to be on board with the historic cinema of Indian film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X