»   » అప్పటికి శ్రీదేవి చనిపోలేదు.. ఇంకా శ్వాస ఆడుతున్నది.. హోటల్ సిబ్బంది.. బోనిది కట్టుకథేనా!

అప్పటికి శ్రీదేవి చనిపోలేదు.. ఇంకా శ్వాస ఆడుతున్నది.. హోటల్ సిబ్బంది.. బోనిది కట్టుకథేనా!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Sridevi Passes Away Twist : శ్రీదేవి చనిపోలేదు..ఇంకా శ్వాస ఆడుతున్నది ?

  అందాల తార శ్రీదేవి భౌతికంగా దూరమైనప్పటికీ ఆమె మధురస్మృతుల నుంచి ఫ్యాన్స్, సహచర నటులు, సినీ తారలు బయటపడలేకపోతున్నారు. ఆమె మరణం అనేక మలుపులు తిరుగుతున్నది. తన మేనల్లుడు పెళ్లి కోసమని శ్రీదేవి, బోనికపూర్, కూతురు కుషి ఫిబ్రవరి 18న దుబాయ్‌కు బయలుదేరి వెళ్లారు. షూటింగ్ కారణంగా జహ్నవి పెళ్లికి దూరంగా ఉంది. శ్రీదేవి జీవితంలో ఫిబ్రవరి 18 నుంచి జరిగిన విషయాలను డిజైనర్ మనీష్ మల్హోత్రా పంచుకొన్నారు. అవి మీకోసం..

  సంతోషం నుంచి మృత్యువులోకి

  సంతోషం నుంచి మృత్యువులోకి

  ఎంతో సంతోషంగా దుబాయ్‌కి బయలుదేరిన శ్రీదేవి అదే తన ప్రయాణమని గానీ, మృత్యు ఒడిలోకి చేరుకొంటున్నానని గానీ ఊహించి ఉండదు. ఎంతో ఉత్సాహంతో దుబాయ్‌కు చేరుకొన్న శ్రీదేవి విగతజీవిగా మారింది.

  శ్రీదేవిని బోని వదిలేసి

  శ్రీదేవిని బోని వదిలేసి

  మోహిత్ మార్వా పెళ్లి ఫిబ్రవరి 20న జరిగింది. ఫిబ్రవరి 21 తేదీన శ్రీదేవిని అక్కడే వదిలేసి బోని, ఖుషీ ముంబైకి తిరిగి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ 24న (శనివారం) దుబాయ్‌కి వెళ్లారు.

  పెయింటింగ్ వేలం కోసం

  పెయింటింగ్ వేలం కోసం

  పెళ్లి తర్వాత శ్రీదేవి ముంబైకి తిరిగి రావాల్సింది. కానీ తాను వేసిన పెయింటింగ్స్ వేలం ప్రక్రియ కోసం ఆమె తన దుబాయ్ పర్యటనను పొడిగించుకొన్నట్టు తెలిసింది. అంతేకాకుండా తన కూతురు జాహ్నవి షాపింగ్ కోసం కూడా కొన్ని రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించుకొన్నట్టు మరో వాదన వినిపించింది.

  24న మళ్లీ దుబాయ్‌కి

  24న మళ్లీ దుబాయ్‌కి

  ఫిబ్రవరి 24న ముంబై నుంచి బోనికపూర్ నేరుగా దుబాయ్‌లో శ్రీదేవి బస చేసిన జుమైరా ఎమిరేట్స్ టవర్ హోటల్‌కు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో చేరుకొన్నారు. అప్పుడే వారిద్దరూ డిన్నర్ డేట్‌కు వెళ్లాలని అనుకొన్నారు.

  బోని కథనం ఇలా..

  బోని కథనం ఇలా..

  బాత్రూంలోకి వెళ్లిన శ్రీదేవి మృత్యువాత పడ్డారు. వెంటనే తన స్నేహితుడి సహకారంతో శ్రీదేవిని హాస్పిటల్‌కు తరలించినట్టు వార్తలు వచ్చాయి. కానీ బాత్రూంలో నేలపై పడి ఉన్న శ్రీదేవిని చూసినట్టు హోటల్ సిబ్బంది చెప్పినట్టు ఓ ఆంగ్ల దినపత్రిక కథనంలో పేర్కొన్నది.

  హోటల్ సిబ్బంది కథనం

  హోటల్ సిబ్బంది కథనం

  అయితే జుమీరా ఎమిరేట్స్ టవర్స్ సిబ్బంది చెప్పిన కథనం మరోలా ఉంది. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో హోటల్ రూం నుంచి సర్వీస్ కావాలని పిలుపు వచ్చింది. అయితే సిబ్బంది తలుపు తట్టినా గానీ డోర్ తీయలేదు అని సిబ్బంది చెప్పడం గమనార్హం.

  శ్రీదేవి ఇంకా చనిపోలేదు..

  శ్రీదేవి ఇంకా చనిపోలేదు..

  శ్రీదేవి ఉన్న రూం తలుపు తీయకపోవడంతో వెంటనే హోటల్ యాజమాన్యానికి సమాచారం అందించాను. దాంతో బలవంతంగా తలుపులు తెరిచాం. అప్పటికే శ్రీదేవి బాత్రూంలో నేలపై పడి ఉన్నది. అయితే అప్పటికి ఇంకా ఆమె చనిపోలేదు.

  నాడి కొట్టుకొంటున్నది..

  నాడి కొట్టుకొంటున్నది..

  నేలపై శ్రీదేవిని చూడగానే ఆందోళన మొదలైంది. ఇంకా హృదయ స్పందన ఉన్నట్టు గుర్తించాం. వెంటనే రషీద్ హాస్పిటల్ తరలించాం అని హోటల్ సిబ్బంది వెల్లడించారు. హాస్పిటల్‌కు తరలించే సరికి ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

  గుండెపోటుతో మరణం అని..

  గుండెపోటుతో మరణం అని..

  ఫిబ్రవరి 25న శ్రీదేవి మరణం జరిగిన వెంటనే బోనికపూర్ సోదరుడు సంజయ్ కపూర్ ఆమె గుండెపోటుతో చనిపోయింది అని వెల్లడించాడు. కానీ ఫిబ్రవరి 26న మాత్రం ఫొరెన్సిక్ రిపోర్టులో ఆమె ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి చనిపోయింది అని వెల్లడించడం వివాదంగా మారింది.

  ఆల్కహాల్ శకలాలు..

  ఆల్కహాల్ శకలాలు..

  గల్ఫ్ న్యూస్ వెల్లడించిన కథనం ప్రకారం.. పోస్ట్ మార్టం నివేదికలో ఆల్కాహాల్ శకలాలు ఉన్నట్టు వెల్లడైంది. దాంతో ఈ కేసును దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించారు. ఆ కారణంగా శ్రీదేవి అంత్యక్రియలు జాప్యం జరుగుతున్నది.

  English summary
  Sridevi left for the wedding with her husband Boney Kapoor and younger daughter Khushi on the morning of February 18. Her elder daughter, Janhvi, could not accompany them, owing to work commitments. The post-mortem revealed traces of alcohol in her body and it is being said that she was under the influence of alcohol when she lost her balance, fell into the bathtub and drowned. The Dubai Police has transferred the case to Dubai Public Prosecution, thus delaying the process of repatriation. Sridevi's mortal remains are expected to reach India sometime on Tuesday.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more