»   » మరో వారంలో శ్రీదేవి గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసింది, కూతురు కోసమే... ఇంతలోనే ఘోరం!

మరో వారంలో శ్రీదేవి గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసింది, కూతురు కోసమే... ఇంతలోనే ఘోరం!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sridevi Last Rites : Jhanvi Kapoor's Heartfelt Letter To Mom

ఇండియన్ సూపర్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి మరణం దేశం మొత్తాన్ని షాక్‌కు గురి చేసింది. శ్రీదేవి మరణించిన వార్తను తొలుత ఎవరూ నమ్మలేదు. కానీ దుబాయ్ హోటల్‌లో ఆమె అత్యంత దారుణమైన రీతిలో అసమజంగా మృత్యువు ఒడిలోకి జారుకుందనే నిజాన్ని అంగీకరించక తప్పలేదు. ఆమె మరణం తర్వాత అనేక వార్తలు. ఆమె హత్య చేయబడిందని, ఆత్మహత్య చేసుకుందని, ప్రమాద వశాత్తు మరణించిందని.... ఇలా రకరకాల అనుమానాలు. కారణమేదైనా తమ అభిమాన తార, అతిలోక సుందరి తమను వదలి వెళ్లిపోయిందనే విషయాన్ని క్రమక్రమంగా జీర్ణించుకోక తప్పని పరిస్థితి.

మరో వారంలో గ్రాండ్ ఈ వెంట్ ప్లాన్ చేసిన శ్రీదేవి

మరో వారంలో గ్రాండ్ ఈ వెంట్ ప్లాన్ చేసిన శ్రీదేవి

తన బంధువు మోహిత్ మార్వా వివాహ వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి.... ఇండియా తిరిగి వచ్చిన వెంటనే ఒక ముఖ్యమైన పనిలో నిమగ్నం కావాలనుకున్నారు. మార్చి 7వ తేదీన జాహ్నవి పుట్టినరోజు ఉండటంతో ఈ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్ చేశారు.

అందుకే వైభవంగా చేయాలనుకున్నారు

అందుకే వైభవంగా చేయాలనుకున్నారు

‘ధడక్' అనే సినిమా ద్వారా జాహ్నవి కపూర్ ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ పుట్టినరోజు వేడుకను బాలీవుడ్ ప్రముఖులందరినీ ఆహ్వానించి వైభవంగా చేయాలనుకున్నారు. మార్చి 7తో జాహ్నవి 21వ వసంతంలోకి అడుగు పెట్టబోతోంది.

గతేడాది జాహ్నవి పుట్టినరోజు శ్రీదేవి ఏం చేసిందంటే..

తన కూతుళ్ల పుట్టినరోజు సందర్భంగా వారి చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం శ్రీదేవికి అలవాటు. గతేడాది జాహ్నవి పుట్టినరోజు సందర్భంగా కూడా జాహ్నవి చైల్డ్‌హుడ్ ఫోటోలను శ్రీదేవి షేర్ చేసి విష్ చేశారు.

ఇది చాలా కఠినమైన సమయం

ఇది చాలా కఠినమైన సమయం

నేడు శ్రీదేవి అంత్యక్రియలు జరుగుతున్నాయి. మరో వారం రోజుల్లో జాహ్నవి కపూర్ పుట్టినరోజు..... ఇలా చాలా కఠినమైన సమయం, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు అని పలువురు అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

కూతుళ్ల భవిష్యత్ కోసం ఆరాటపడింది

కూతుళ్ల భవిష్యత్ కోసం ఆరాటపడింది

కుటుంబ ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో శ్రీదేవి చిన్నతనం నుండి సినిమాల్లో నటిస్తూనే గడిపింది. స్కూలు, కాలేజీ జీవితాన్ని ఆమె అనుభవించలేదు. తన కూతుళ్ల జీవితం తనలా కాకూడదనే ఉద్దేశ్యంతో ముందు వారి చదువుకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. గ్రాజ్యుయేషన్ పూర్తయిన తర్వాతే జాహ్నవి సినిమా ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

భర్త ఆస్తులు అమ్ముతుంటే బాధపడింది

భర్త ఆస్తులు అమ్ముతుంటే బాధపడింది

నిర్మాతగా తీవ్ర నష్టాల పాలైన బోనీ కపూర్..... శ్రీదేవి పేరు మీద ఉన్న ఆస్తులు అమ్మి తన అప్పులు కవర్ చేశారు. అటు భర్తను కాదనలేక, ఇటు కూతుళ్లకు ఇవ్వడానికి చివరకు తన వద్ద ఏమీ మిగలదేమో అనే సంఘర్షణలో శ్రీదేవి కొట్టుమిట్టాడింది.

తన కళ్లతో చూడక ముందే...

తన కళ్లతో చూడక ముందే...

చిన్నతనం నుండి శ్రీదేవి కష్టపడుతూ బ్రతికింది. వివాహం తర్వాత ఆమె సంతోషంగా ఉన్నది లేదు. బోనీ మొదటి భార్యతో గొడవలు, ఇతర అంశాలతో ఎప్పుడూ బాధలోనే ఉండేది. ఆమె జీవితంలో అత్యంత సంతోషకర విషయం ఆమె ఇద్దరు కూతుళ్లే. వారే తన సర్వస్వంగా జీవించింది. తన ముద్దుల కూతురు జాహ్నవిని తెరపై హీరోయిన్ గా చూడాలని ఆశ పడింది. ఆ కోరిక తీరకుండానే ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు.

శ్రీదేవి అంత్యక్రియలు

శ్రీదేవి అంత్యక్రియలు

శ్రీదేవి భౌతిక కాయానికి బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జరుగనుంది. మంగళవారం రాత్రి దుబాయ్ నుండి శ్రీదేవి భౌతిక కాయం ముంబైలోని లోఖండ్ వాలా, గ్రీన్ ఏకర్స్ లోని ఆమె స్వగృహానికి చేరుకోవడంతో సినీ ప్రపంచం మొత్తం అక్కడికే చేరుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ కి చెందిన పలువురు నటీనటులు ఆమెను కడసారి చూసేందుకు తరలివచ్చారు.

ప్రజల సందర్శనార్ధం సెలబ్రేషన్స్ క్లబ్ వద్ద

ప్రజల సందర్శనార్ధం సెలబ్రేషన్స్ క్లబ్ వద్ద

బుధవారం ఉదయం శ్రీదేవి భౌతిక కాయాన్ని ముంబై లోఖండ్ వాలా ప్రాంతంలోని గ్రీన్ ఏకర్స్ లో ఉన్న నివాసం నుంచి సెలబ్రేషన్స్ క్లబ్ కు తరలించారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆమె భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్ధం ఉంచనున్నారు.

English summary
It is a tough time for the star kid as her mother's funeral is today and her birthday is next week. Sridevi was at the peak of her career when she gave it up all and embraced motherhood. The Mom actress was extremely excited about Janhvi's debut Dhadak, but unfortunately, she won't be by Janhvi's side, for her big moment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu