»   » శ్రీదేవి అంత్యక్రియలకు వెళ్లేది వీరే.. తెలుగు, తమిళ పరిశ్రమల నుంచి..

శ్రీదేవి అంత్యక్రియలకు వెళ్లేది వీరే.. తెలుగు, తమిళ పరిశ్రమల నుంచి..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sridevi's Last Rites : Everything You Wanted To Know

గ్లామర్ క్వీన్ శ్రీదేవి మృతివార్తతో తల్లడిల్లిన ప్రతీ ఒక్కరు సోషల్ మీడియాలోనూ, ఇతర మార్గాలలో తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక శ్రీదేవిని కడసారి దర్శించుకొనేందుకు అభిమానులు ఇప్పటికే ఆమె నివాసం వద్దకు భారీ సంఖ్యలో గుమిగూడారు. పలువురు దక్షిణాదికి చెందిన సినీ ప్రముఖులు ముంబైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

ముంబైకి చేరుకొన్న రజనీకాంత్

ముంబైకి చేరుకొన్న రజనీకాంత్

శ్రీదేవితో దాదాపు 20 చిత్రాల్లో కలిసి నటించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇప్పటికే ముంబై చేరుకొన్నారు. శ్రీదేవి తొలిచిత్రం మూండ్రూ ముడిచు అనే చిత్రంలో రజనీ, కమల్ హాసన్‌తో కలిసి ఆమె నటించిన సంగతి తెలిసిందే. తనకు అత్యంత ఆప్తురాలైన శ్రీదేవిని కడసారి చూసేందుకు ఆయన ప్రస్తుతం ముంబైలో ఉన్నారు.

 దర్శకుడు రాఘవేంద్రరావు కూడా

దర్శకుడు రాఘవేంద్రరావు కూడా

తెలుగులో శ్రీదేవితో దాదాపు 24 చిత్రాల్లో కలిసి పనిచేసిన దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ముంబైకి వెళ్తున్నట్టు సమాచారం. శ్రీదేవి అత్యంత ఇష్టమైన నటిగా చెప్పుకునే రాఘవేంద్రరావు ఆమెకు శ్రద్ధాంజలి అర్పించనున్నారు.

 హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్

హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్

తెలుగు హీరోలలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అంత్యక్రియలకు హాజరుకానున్నట్టు తెలుస్తున్నది. ఇంకా వీరితోపాటు పలువురు సినీ ప్రముఖులు కూడా టాలీవుడ్ నుంచి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

తమిళ పరిశ్రమ నుంచి

తమిళ పరిశ్రమ నుంచి

తమిళ పరిశ్రమకు చెందిన భారతీరాజా, కమల్ హాసన్, ప్రకాశ్ రాజ్ తదితరులు కూడా శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొనే అవకాశం ఉంది.

English summary
It’s an end of an era for Indian cinema as it lost one of its legendary actors – Sridevi. Following a massive cardiac arrest, the actress breathed her last on 24th February evening. Her sudden death has left the film industry in shock. Reports suggest that, Chiranjeevi, Nagarjuna and Venkatesh are expected to attend the funeral. Also, Bharathiraaja who directed her in many films, Prakash Raj, K Raghavendra Rao are expected to be part of the last rites.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu