»   » శ్రీదేవి కూతురు బోడి గుండుతో.... (ఫోటోస్)

శ్రీదేవి కూతురు బోడి గుండుతో.... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ శ్రీదేవి తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటో ఒకటి హాట్ టాపిక్ అయింది. నిన్న(మార్చి 6) శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ బర్త్ డే. అయితే సినిమా కమిట్మెంట్ల వల్ల శ్రీదేవి తన కూతురు పుట్టినరోజు నాడు ఆమెతో గడపలేక పోయింది. దీంతో తన మనసులోని విషయాన్ని ఆమె ట్విట్టర్లో పోస్టు చేసారు. జాను...నిన్ను చాలా మిస్సవుతున్నాను అంటూ ట్వీట్ చేసింది. అంతే కాదు జాన్వి చిన్ననాటి ఫోటో ఒకటి పోస్టు చేసింది. ఇందులో జాన్వి బోడి గుండుతో ఉండటం విశేషం.

హీరోలు, హీరోయిన్లు వారసత్వాన్ని పునికి పుచ్చుకుని వారి కొడుకులు, కూతుళ్లు కూడా సినిమా రంగంలోకి రావడం చాలా కాలంగా నడుస్తున్న తంతే. తాజాగా శ్రీదేవి కూతురు జాన్వి కూడా ఈ లిస్టులో చేరి పోయింది. జాన్వి హీరోయిన్‌గా తెరంగ్రేటం చేయబోతోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. శ్రీదేవి మాత్రం సినిమా ఓకే అయ్యే వరకు ఏ విషయాన్ని బయటకు చెప్పడానికి ఇష్ట పడటం లేదు.

Also Read: ఇన్నాళ్లూ బయిటకు రాని : శ్రీదేవి కూతురు హాట్ ఫొటోలు... చూస్తే షాక్

జాన్వి నటించబోయే సినిమాను స్వయంగా ఆమె తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీదేవి, బోనీ కపూర్ జాన్వి కోసం పలు కథలు వింటున్నారు. అయితే ఇప్పటి వరకు ఆమెకు సెట్టయే కథ దొరకలేదని టాక్. స్లైడ్ షోలో ఫోటోస్...

జాన్వి కపూర్

జాన్వి కపూర్

నిన్న జాన్వి కపూర్ బర్త్ డే సందర్భంగా శ్రీదేవి పోస్టు చేసిన బోడిగుండు ఫోటో...

జాన్వి కపూర్

జాన్వి కపూర్

హీరోయిన్ కావాలనే లక్ష్యంతో ఉన్న జాన్వి కపూర్ ఈ మధ్య ఏ కార్యక్రమానికి హాజరైనా ప్రత్యేక మైన వస్త్రధారణలో హాట్ అండ్ సెక్సీ లుక్‌లో దర్శనమిస్తోంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపుతెచ్చుకునే ప్రచత్నం చేస్తోంది.

ఫ్యామిలీ సపోర్ట్

ఫ్యామిలీ సపోర్ట్

సినిమా వాతావరణంలో పెరిగిన పిల్లలు ఆరంగం వైపు ఆకర్షితులవ్వడం మామూలే. హీరోయిన్ కావాలనే జాన్వి కోరికకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా సపోర్టుగా ఉంటున్నారట.

ట్రైనింగ్

ట్రైనింగ్

ప్రస్తుతం ఝాన్వి చదువుతోపాటు నృత్యం కూడా నేర్చుకొంటోంది. డైలాగ్స్ ఎలా పలకాలో కూడా తెలుసుకుంటోంది. జిమ్‌లో కష్టపడుతూ శరీరాకృతిని కాపాడుకొంటోంది. ఇవన్నీ చూస్తోంటే ఆమె వెండి తెర ప్రవేశానికి మరెన్నో రోజులు లేవని సన్నిహితులు చెబుతున్నారు.

English summary
Sridevi shared an adorable childhood picture of her daughter on the micro-blogging page and wrote, 'Missing you Janu. Happy Birthday! #JanhviBirthday'. In the photograph, Jhanvi who was seen in a typical South Indian traditional attire sports a bald head.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu