»   » ఇంకోటి: 'మదర్‌'గా శ్రీదేవి

ఇంకోటి: 'మదర్‌'గా శ్రీదేవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై :చాలా కాలం గ్యాప్ తర్వాత 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌' చిత్రంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలెట్టింది శ్రీదేవి. గతంలో తన గ్లామర్‌తో ఉర్రూతలూగించిన శ్రీదేవి ఇప్పుడు నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలపై దృష్టిపెడుతోంది. ఆంగ్లంలో మాట్లాడలేకపోవడం వల్ల సొంత కుటుంబ సభ్యుల నుంచే అవమానాలు ఎదుర్కొనే మధ్యతరగతి గృహిణిగా 'ఇంగ్లిష్‌ వింగ్లిష్‌'లో ఆకట్టుకున్న శ్రీదేవి, ఇప్పుడు మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమైంది.

వాణిజ్య ప్రకటనల దర్శకుడు రవి ఉదయ్‌వర్‌ దర్శకత్వం వహించే ఓ సినిమాలో ప్రధాన పాత్రలో నటించనుంది. తల్లీకూతుళ్ల అనుబంధం, ప్రేమ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'మదర్‌' అన్న పేరును నిర్ణయించినట్లు సమచారం. తల్లిగా శ్రీదేవి నటించనున్న ఈ సినిమాలో కూతురి పాత్రకు కొత్త నటిని ఎంపిక చేయనున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

విజయ్ హీరోగా శింబుదేవన్‌ దర్శకత్వం వహిస్తున్న ఓ ఫాంటసీ చిత్రంలో శ్రీదేవి కీలకపాత్రలో నటిస్తోంది. ఇందులో పాలబుగ్గల సుందరి హన్సిక రాకుమారి పాత్రలో కనిపించబో తోంది. రాకుమారికి తల్లిపాత్రలో శ్రీదేవి నటిస్తోంది. విజయ్ సరసన శృతిహాసన్‌ ప్రధాన నాయికగా నటిస్తోంది. ప్రస్తుతం చెన్నయ్ శివారులో దాదాపు 16 ఎకరాల్లో భారీ సెట్‌ వేసి అందులో చిత్రీకరణకు సిద్ధమవుతున్నారని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..

Sridevi to be seen in ‘Mother’

'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌' తరవాత మళ్లీ కెమెరా ముందుకు రాలేదు శ్రీదేవి. ఆమె కోసం ఎన్ని పాత్రలు సిద్ధమైనా తొందర పడలేదు. ఎట్టకేలకు ఓ సినిమాపై సంతకం చేసిందని సమాచారం. తమిళ దర్శకుడు చింబుదేవన్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్‌ హీరో. ఈ చిత్రంలో హీరోయిన్ గా హన్సికను ఎంచుకొన్నట్టు తెలుస్తుంది. హీరోయిన్ తల్లి పాత్ర కూడా కథలో కీలకమేనట. ఆ పాత్రలో నటించడానికి శ్రీదేవి అంగీకరించారని తమిళ చిత్రవర్గాలు చెబుతున్నాయి.

సుదీప్‌ మరో కీలక పాత్రలో కనిపించే ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ''శ్రీదేవిని సంప్రదించిన మాట నిజమే. త్వరలో ఆమె నిర్ణయాన్ని వెల్లడిస్తారు. అంత వరకూ కాస్త ఓపిక పట్టండి'' అని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

చిత్రం విషయానికి వస్త్తే...

విజయ్... ఈ దీపావళికి కత్తిలా తెరపైకి వచ్చి హిట్ కొట్టారు. తాజాగా మారీశన్‌గా మారడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఎస్.విజయ్ తదుపరి చిత్రం మారీశన్ అనే పేరు పరిశీలనలో ఉంది. వడవేలును హీరోగా చేసి హింసై అరసన్ 23ఆమ్ పులికేసి చిత్రాన్ని తెరకెక్కించి విజయం సాధించిన యువ దర్శకుడు శింబుదేవన్ విజయ్‌ను డెరైక్ట్ చేయనున్న చిత్రం మారీశన్.

క్రేజి ముద్దుగుమ్మలు హన్సిక, శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించనున్నారు. శ్రీదేవి, కన్నడ నటుడు సుదీప్ ప్రధాన పాత్రలు పోషించనునన్నారు. ఈ చిత్రం ఫాంటసీ కథాంశంతో తెరకెక్కనుంది. ఈ కథను మొదట ధనుష్‌తో చేయూలని అనుకున్నట్టు ప్రచారం జరిగింది. తర్వాత ఏమైందోగాని మారీశన్‌గా విజయ్ మారుతున్నారు.

దీన్ని ఆయన వద్ద చాలా ఏళ్లుగా పీఆర్‌వోగా పనిచేస్తున్న పి.టి.సెల్వకుమార్ నిర్మించనున్నారు. ఛాయాగ్రహణను నటరాజన్ అందించనున్నారు. దీన్ని సరస్సులు, పర్వతాలు, అందమైన పూతోటలు అంటూ అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని సుందరమైన ప్రాంతాల్లో మారీశన్‌ను రూపొందించనున్నట్లు సమాచారం.

English summary
Sridevi is going to play the lead role in a new film that has a heart touching mother and daughter story as the base. The movie has been titled ‘Mother’ and Sridevi is excited about the film.
Please Wait while comments are loading...