»   » ఓరి బ్రహ్మ దేవుడో.. శ్రీదేవి నటజీవితానికి 50 ఏళ్లు.. సినీ దేవతకు అద్భుతమైన గిఫ్ట్..

ఓరి బ్రహ్మ దేవుడో.. శ్రీదేవి నటజీవితానికి 50 ఏళ్లు.. సినీ దేవతకు అద్భుతమైన గిఫ్ట్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెండితెర మీద అలనాటి అందాల తార శ్రీదేవి గ్లామర్ చూస్తే ఓరి బ్రహ్మ దేవుడో అని అనుకోవాల్సిందే. ఆమె అందం అలాంటింది. 70 నుంచి 90 దశకాల వరకు భారతీయ సినిమా పరిశ్రమలో వెలుగువెలిగారు. అలాంటి శ్రీదేవి కేరీర్ ప్రారంభించిన 50 ఏళ్లు పూర్తయ్యాయి. తన 50 ఏళ్ల నట ప్రస్థానంలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ సినీ రంగాల్లో ఎదురులేని విజయాలను సొంతం చేసుకొన్నది. బాలీవుడ్ నిర్మాత బోనికపూర్‌ను వివాహం చేసుకొన్న తర్వాత నటనకు కొంత గ్యాప్ ఇచ్చారు శ్రీదేవి. ఇటీవల ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో హిందీలో ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం మామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. శ్రీదేవీ కూతురు జాహ్నవి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నది.

1967లో అడుగుపెట్టి..

1967లో అడుగుపెట్టి..

శ్రీదేవి సినీ పరిశ్రమలోకి 1967 జూలై 7వ తేదీన అడుగుపెట్టింది. నాలుగేళ్ల వయసులో బాలనటిగా శ్రీదేవి ఓ చిత్రంలో నటించింది. బాలనటిగా రాణిస్తూ పదహారేళ్ల వయసు చిత్రంతో హీరోయిన్‌గా మారారు. అప్పటి నుంచి భాషా బేధాలు లేకుండా ఆమె సినీరంగానికి వరుస హిట్లను అందించింది. ఇప్పటివరకు 300వ చిత్రాల్లో నటించింది. తాజాగా నటిస్తున్న మామ్ చిత్రం 300వ చిత్రం కావడం విశేషం.

శ్రీదేవికి ప్రత్యేకమైన బహుమతి..

శ్రీదేవికి ప్రత్యేకమైన బహుమతి..

శ్రీదేవి నట జీవితం ప్రారంభించి ఈ ఏడాదికి 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తాజాగా ఆమెకు బోనికపూర్‌ ప్రత్యేకమైన బహుమతిని ఇవ్వనున్నరట. శ్రీదేవి అడుగుపెట్టిన జూలై 7 వ తేదీని పురస్కరించుకొని అదే తేదీన మామ్ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మంచి స్పందన..

మంచి స్పందన..

దేశంలోని అతిపెద్ద సూపర్‌స్టార్లలో శ్రీదేవి ఒకరు. గత 50 ఏళ్లలో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎందరో అభిమానులను సంపాదించుకొన్నారు. ఇంగ్లీష్ వింగ్లీష్ తర్వాత మామ్ కోసం అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు. టీజర్ విడుదలైన తర్వాత దక్షిణాది డిస్టిబ్యూటర్ల నుంచి విపరీతమైన స్పందన వస్తున్నది. డబ్బింగ్ చేయాలని పలువురు అడుగుతున్నారు. దాంతో హిందీతోపాటు ఇతర భాషల్లో డబ్బింగ్ చేస్తున్నాం అని బోని ఇటీవల మీడియాకు వివరించారు.

మామ్‌ను అద్భుతమైన..

మామ్‌ను అద్భుతమైన..

మామ్ సినిమాను బోని కపూర్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ మేరకు నిర్మాణాంతర పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. శ్రీదేవి జీవితంలో మామ్‌ను మరిచిపోలేనటువంటి సినిమాగా మార్చాలనే పట్టుదలతో బోని కపూర్ ఉన్నారు. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా, అభిమన్యు సింగ్ తదితరులు నటిస్తున్నారు. రవి ఉద్యావార్ దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
In a career spanning over 50 years, Sridevi has done some 300 films. The English Vinglish actor, who went onto become one of the most sought-after heroines in the 80s and 90s, has innumerable hits to her name in Hindi, Tamil, Telugu, Malayalam and Kannada. Boney Kapoor has a special gift for Sridevi on completing 50 years in film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu