»   » మహేష్ బాబు అంత దారుణమైన మాటనేసాడేంటి?

మహేష్ బాబు అంత దారుణమైన మాటనేసాడేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రం ఆడియో ఫంక్షన్ ఇటీవల హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో వేడుకలో మహేష్ బాబు నోటి నుండి వచ్చిన ఓ మాట ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. మహేష్ బాబు వ్యక్త పరిచిన అభిప్రాయంపై కొందరు అసంతృప్తిగా ఉన్నారు.

ఆడియో వేడుకలో మహేష్ బాబు... దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గురించి మాట్లాడుతూ....'శ్రీకాంత్ గారంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆయన ప్యూర్ హ్యూమన్ బీయింగ్. మన ఇండస్ట్రీ వారితో ఎక్కువగా కలవరు. అందుకేనేమో అంత ప్యూర్ గా ఉన్నారు. ఆయన సినిమాల్లో ఎప్పుడూ మన రియల్ లైఫ్ సిచ్చువేషన్స్ ఉంటాయి. ఆయనతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేసి ఒక హ్యూమన్ బీయింగ్‌గా ఎదిగాను. బ్రహ్మోత్సవంతో ఇంకా ఎక్కువ ఎదిగాను' అన్నారు.

Srikanth Addala is a good human being: Mahesh Babu

అయితే మహేష్ బాబు మాటల్లో పలువురు పలు రకాల అర్థాలు తీస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల ఇండస్ట్రీ వారితో ఎక్కువగా కలవక పోవడం వల్లే చాలా మంచి వ్యక్తిగా ఉన్నారనేది మహేష్ మాటల్లోని అర్థం. మహేష్ బాబు కూడా ఇండస్ట్రీలో ఎవరితోనూ ఎక్కువగా కలవరు. అంటే ఇండస్ట్రీ జనాలపై మహేష్ బాబుకు మంచి అభిప్రాయం లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిశ్రమలో ఎవరో కొందరు మోసగాళ్లు, మాయగాళ్లు ఉన్నారని....ఇండస్ట్రీ మొత్తాన్ని అలానే చూడటం దారుణం అంటున్నారు.

శ్రీకాంత్ అడ్డాల విషయానికొస్తే...స్టూడెంట్ గా ఉన్న టైమ్ నుంచే ఆయన చాలా సైలెంట్. ఎవరు ఎలా అనుకున్నా తనకు నచ్చినట్లు ఉండే వ్యక్తి. బంధాలు, అనుబంధాలకు ఎక్కువ విలువ ఇచ్చే వ్యక్తి. హంగులు ఆర్బాటాలకు వెళ్లడం ఆయనకు ఇష్టం ఉండదు. కొన్ని కొన్ని విషయాల్లో శ్రీకాంత్ తీరు చూసి కొంత మంది ఆయన్ను ఆఫ్ మైండ్ అనే వారు అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

English summary
"Srikanth Addala is a good human being, may be because he doesn’t mingle much with people from the industry." Mahesh Babu said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X