»   » నాగబాబు కొడుకుకి ముహూర్తం తేదీ ఫిక్స్

నాగబాబు కొడుకుకి ముహూర్తం తేదీ ఫిక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌ తొలి చిత్రానికి దర్శకుడు ఎవరనే సస్పెన్స్ ముగిసింది. గత కొంతకాలంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ ప్రశ్నలకి సమాధానం దొరికింది. మొదట శ్రీకాంత్ అడ్డాల పేరు అనుకున్నా ఆ ప్రాజెక్టు అప్పట్లో కాన్సిల్ కావటంతో ...మధ్య గ్యాప్ లో చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఈ సినిమా మళ్లీ శ్రీకాంత్‌ అడ్డాల చేతుల్లోకి వెళ్లింది.

  Varun Tej

  'కొత్తబంగారులోకం',' సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో తనదైన ముద్ర తెలుగు తెరపై వేసి ఆకట్టుకొన్నాడీ దర్శకుడు. ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో తొలి అడుగులు వేయించేందుకు సిద్ధమవుతున్నాడు.ఈ చిత్రానికి ఠాగూర్‌ మధు, నల్లమలపు శ్రీనివాస్‌ నిర్మాతలు. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. 2014 జనవరి 1న ఈ చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లనుంది. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందిస్తారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలుస్తాయి.

  ప్రస్తుతం వరుణ్ తేజ్‌ హీరోగా నిలదొక్కుకునేందుకు కావాల్సిన క్వాలిటీస్‌ను మరింత మెరుగు పరుచుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా డాన్స్‌ల విషయంలో చాలా కష్టడుతున్నాడని వినికిడి. మెగాస్టార్ చిరంజీవి తనతైన డాన్స్ స్టెప్పులతో థియేటర్లను షేక్ చేసాడు. ఆ తర్వాత ఆయన వారసత్వంతో అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ డాన్స్‌ల విషయంలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా స్టైల్ విషయంలో, డాన్స్ విషయంలో ప్రత్యేకత చాటుకోవడానికి ట్రై చేస్తున్నాడట.

  English summary
  
 Varun Tej, actor Nagababu's son, has been waiting to be launched as hero. several names popped up like director Krish and director Sekhar Kammula. And finally, director Srikanth Addala of Seethamma Vaakitlo Sirimalle Chettu and Kotta Bangaru Lokam has decided to launch Varun Tej in his next film. This love story will commence its regular shoot from Jan 1, 2014. Mickey J Meyer will compose the music.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more