»   » ‘దేవరాయ’గా శ్రీకాంత్

‘దేవరాయ’గా శ్రీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Srikanth
గతంలో ఎన్నడూ చూడని విధంగా నటుడు శ్రీకాంత్ ను సరికొత్త పాత్రలో చూడ బోతున్నాం. శ్రీకృష్ణరాయుల్ని తలపించే గెటప్ లో 'దేవరాయ" సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సన్‌రే ఇంటర్నేషనల్ సినిమా పతాకంపై కిరణ్ జక్కంశెట్టితో కలిసి నానికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించడంతోపాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు.

ఈ గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ -''ఇందులో శ్రీకృష్ణదేవరాయలు, దొరబాబుగా రెండు పాత్రలు చేస్తున్నాను. 1500 సంవత్సరాల క్రితం జరిగిన కథను తీసుకుని ఈ చిత్రాన్ని చేస్తున్నాం. ముందుగా ఈ కథ విన్నప్పుడు చేయగలనా? అనుకున్నాను. అయితే ఇటీవల 'శ్రీరామరాజ్యం" చేయడంవల్ల ఈ సినిమాలో యాక్ట్ చేయగలననే నమ్మకం కుదిరింది"" అన్నారు.

దర్శక నిర్మాత కిరణ్ మాట్లాడుతూ.....''ఇది అద్భుతమైన కథ. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్‌పరంగా సినిమా గ్రాండ్‌గా ఉంటుంది. సెప్టెంబర్ 13న షూటింగ్ ఆరంభించి మూడు షెడ్యూల్స్‌లో పూర్తి చేస్తాం"" అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు : వీరబాబు, స్క్రీన్‌ప్లే: రవిరెడ్డి మల్లు, సంగీతం : చక్రి

English summary
Srikanth is acting as 'Devaraya' in his new film. this film will be directed and produced by kiran jakkamshetti.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu