For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వెంకీ 'షాడో' లో శ్రీకాంత్ పాత్ర ఏమిటి?

  By Srikanya
  |

  హైదరాబాద్ : వెంకటేష్ తాజా చిత్రం 'షాడో' . ఈ చిత్రంలో శ్రీకాంత్ పాత్ర యాక్షన్ తో సాగబోతోంది. ఈ విషయం శ్రీకాంత్ తెలియచేస్తూ...వెంకటేష్‌ని పట్టుకోవడానికి ప్రయత్నించే పోలీస్‌ అధికారిని నేను. మంచి యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. గతంలో 'సంక్రాంతి' సినిమాలో నేనూ వెంకటేష్‌ కలిసి నటించాం. అది కుటుంబ బంధాల నేపథ్యంలో సాగుతుంది. 'షాడో' స్త్టెలిష్‌గా సాగే కథ. డాన్‌ తరహాలో ఉంటుంది అన్నారు.


  'షాడో' సినిమా షూటింగ్‌ సందర్భంగా జరిగిన ప్రమాదం గురించి శ్రీకాంత్ చెపుతూ... వేగంగా వెళ్తున్న కారులోంచి బయటకు దూకే సన్నివేశమది. నన్ను నేను నియంత్రించుకోలేకపోయా. అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడ్డా. అది నిజంగా మరో జన్మ. 'నా కోసం ఇంకా కొన్ని సినిమాలు మిగిలున్నాయి' అనిపించింది అన్నారు. 'నేను ఎవరన్నది మిస్టరీ...నేను క్రియేట్ చేసింది హిస్టరీ...అడుగేస్తే విక్టరీ...' అంటూ ఇటీవల విడుదలైన 'షాడో' టీజర్స్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. వెంకటేష్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'షాడో'. తాప్సి హీరోయిన్ . శ్రీకాంత్‌, మధురిమ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. పరుచూరి శివరామప్రసాద్‌ నిర్మాత. ప్రస్తుతం మలేషియాలో చిత్రీకరణ జరుగుతోంది. ప్రధాన తారాగణంపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

  ఈ చిత్రం స్టోరీ గురించి దర్శకుడు మాట్లాడుతూ...'ఓ సాధారణ యువకుడు డాన్‌గా ఎదిగి అండర్ వరల్డ్ ప్రపంచాన్ని ఎలా శాసించాడన్నదే 'షాడో' చిత్ర కథ. వెంక కొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది. ఆయన పాత్ర చిత్రణ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో వెంక అండర్‌వరల్డ్ డాన్‌గా స్టైలిష్ పాత్రలో కనిపిస్తారు. ఆయన పాత్ర చిత్రణ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటుంది'అన్నారు.

  అలాగే ''వెంకటేష్‌ సినిమా అంటే... ప్రేమ, వినోదం, యాక్షన్‌, భావోద్వేగాలు ఇలా అన్ని అంశాలకూ సమ ప్రాధాన్యముంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన చిత్రమిది. వెంకటేష్‌ని సరికొత్త పాత్రలో చూపించే ప్రయత్నం చేశాం. ఆయన వేషధారణ, హావభావాలు ఇందులో భిన్నంగా ఉంటాయి. శ్రీకాంత్‌తో కలిసి చేసిన యాక్షన్‌ ఘట్టాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి'' అన్నారు.

  ''మాఫియా నేపథ్యంలో సాగే కథ ఇది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభించింది. సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము'' అన్నారు నిర్మాత. వెంకి అభిమానులు ఆయన నుంచి ఏ తరహా యాక్షన్ ఎంటర్‌టైనర్ రావాలని ఆశిస్తున్నారో ఆ తరహా చిత్రమే 'షాడో'. అందరి అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది. ఈ చిత్రానికి సుప్రీత్‌, ఎమ్మెస్‌ నారాయణ, సత్యప్రకాష్‌ ఇతర పాత్రధారులు. కథ: గోపీమోహన్‌, కోన వెంకట్‌, సంగీతం: తమన్‌.

  English summary
  Srikanth is playing powerful police office role in Shodow movie. Mehar Ramesh is the director of the film. Paruchuri Shivaram Prasad is producing the movie on United Movies banner. Taapsee is the female lead in this film. This movie is touted to be a comedy action entertainer for which Kona Venkat and Gopi Mohan penning the script. Srikanth and Madhurima are the another lead pair in this film. 
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more