»   » దర్శకుడు నీలకంఠ మరోసారి మెగాఫోన్ తో రెడీ

దర్శకుడు నీలకంఠ మరోసారి మెగాఫోన్ తో రెడీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

షో, మిస్సమ్మ, నందనవనం 120 కిలో మీటర్లు, సదా మీ సేవలో, మిస్టర్ మేధావి వంటి చిత్రాలు డైరక్ట్ చేసిన నీలకంఠ గుర్తుండే ఉంటారు. ఆయన చాలా గ్యాప్ తర్వాత శ్రీకాంత్ హీరోగా ఓ చిత్రం డైరక్ట్ చేయబోతున్నారు. శ్రీకాంత్ సోదరుడు అనిల్ కుమార్ నిర్మించే ఈ చిత్రం 2011 జనవరిలో ప్రారంభం కానుంది. నీలకంఠ నేరేట్ చేసిన కథ నచ్చిన శ్రీకాంత్ ఈ చిత్రానికి తనే పెట్టుబడి పెట్టడం విశేషం. ఇక శ్రీకాంత్ ప్రస్తుతం సేవకుడు చిత్రంలో చేస్తున్నారు. ఛార్మి హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని వి.సముద్ర డైరక్ట్ చేస్తున్నారు. అలాగే పోసాని కృష్ణమురళి దర్శకత్వంలో దుస్సాశన చిత్రం కూడా కమిటయ్యారు. మరో ప్రక్క శ్రీకాంత్ ద్విపాత్రాభినయం చేసిన రంగ..ది దొంగ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu